హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన నర్సులకు మంగళవారం ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ అందజేయనున్నారు. కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ అందుకోబోతున్న నర్సులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ఆరోగ్య శాఖలో 1919, లేబర్ డిపార్టుమెంట్‌లో 257 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ చేసింది. ఇందులో ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు పొందిన 1,919 మందికి రేపు అపాయింట్‌మెంటు ఆర్డర్లు అందజేయనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





