‘సుడిగాలి’

“నలభై మూడేళ్ల తరువాత, 2026లో, ఇదే సంపాదకీయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితులతో పోల్చి పరిశీలించడం అత్యంత సముచితం. ఎన్టీఆర్ నిర్మించిన పార్టీ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొనసాగుతున్న పార్టీ, ఇప్పుడు నారా లోకేశ్ రాజకీయ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో కనిపిస్తున్న పరిణామాలు, ఈ మూడింటి మధ్య తేడాలను చారిత్రక దృష్టితో అనేక కోణాలతో పరిశీలించాలి. అయితే, వ్యక్తులపై ఆరోపణలు చేయడం కంటే పార్టీ నిర్మాణం, నాయకత్వ వారసత్వం, సీనియర్ల పాత్ర, సిద్ధాంతాలు, ఎన్నికల హామీలు, పాలనా ప్రాధాన్యాలు వంటి అంశాలపై ఆధారాలతో విశ్లేషణ చేయవలసి ఉంటుంది..” 

యం యస్ ఆచార్య సంపాదకీయం, ఆచార్య గారు ఎంపిక చేసిన రెండు మంచి మాటలు
వారి 8.1.1983 నాటి సంపాదకీయం. వారి శీర్షిక ‘సుడిగాలి’. ఉప శీర్షికలు, పోలిక, పరిచయం, ఈనాటి  తెలుగుదేశం పార్టీ రాజకీయాలు వివరాలు చూడవచ్చు.
· ఒప్పందానికి వద్దామనుకునేవారు విప్లవాన్ని సాధించలేరు’’  – కెమల్‌ అటాలుర్‌’
·
‘స్వేచ్ఛ’’ ‘‘అనేది తనంతట అది పూడిపడదు. స్వేచ్ఛను ప్రజలు సాధించుకోవాలి కష్టపడి సంపాదిస్తే కాని అది సిద్ధంచదు’’. ` కోల్టన్‌

చలన చిత్రరంగంలో మకుటంలేని మహారాజువలె వెలుగుతూ రాజకీయాల్లో దునికినప్పుడు ఎన్‌.టి.రామారావు ఆంధ్ర రాజకీయాలను సంచలింపచేస్తారని అనుకున్నారు. కాని ఇందిరా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పార్టీ అధిష్టానవర్గం రామారావు ఎదుగుదలకు, ప్రసంగాలకు విమర్శలకు అనవసర ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. సినిమా గ్లామరు వల్ల జనం వస్తున్నారనుకున్నారు. కాని రెండోసారి మూడోసారి పర్యటనతో కూడా వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి కళ్ళు చెదిరాయి.

ఒంటరిగా పోటీ చేస్తాననడం అమాయకత్వం

ప్రతిపక్షాలతో ఒప్పందం కుదుర్చుకోదలచుకున్నప్పుడు ఫరవాలేదనుకున్నారు. కాని వారితో నాకేం ఒంటరిగానే పోరాడుతానని ఎన్‌.టి.ఆర్‌. ధైర్యం చేసినప్పుడు రాజకీయ అమాయకత్వం అని నవ్వుకున్నారు. శ్రీ గౌతులచ్చన్న వంటి మహామహులు రామారావుతో రాయబారానికి ఏగినప్పుడు ‘‘ఇదేమిచోద్యం’’ అని ఆశ్చర్యపడ్డారు. తెలంగాణాలో రామారావు సున్నాలని ఓ యాభై అరవై వస్తాయిలే అని పెదవి విరిచారు.

ఇందిర గాలి, గాలికి పోయింది

కాని ఇందిరా కాంగ్రెస్‌ రామారావు పార్టీని ఖచ్చితంగా అంచనా వేసింది. ఇందిరా గాంధీ గాలిని, రామారావుగాలి ఎదిరించగలుగుతుందని ముందే ఊహించింది. అందుకే ముఖ్యమంత్రిని మార్చింది. మధ్యాహ్న భోజనం పెట్టింది. తక్కువ ధరకు బియ్యం అమ్మింది. అన్నిటికీ మించి ఒకొక్క నియోజకవర్గంలో ఇదివరకెన్నడూ లేనంత ఉధృతంగా ‘‘ఖర్చుగా చేసింది. శ్రీమతి ఇందిరాగాంధీ స్వయంగా ఊరూరా వాడవాడలా తిరిగింది. రంగురంగుల ప్రచార సామాగ్రిని ప్రవేశ పెట్టింది. ప్రతిష్టకు సంబంధించిన ప్రశ్నగా పరిగణించి తన సర్వశక్తియుక్తులను పాలక యంత్రాంగ ప్రభావాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్నది. వందలాదికోట్ల రూపాయలు వేలాది జీవులు, కలర్‌ సినిమాలు రంగైన ప్రచార సాధనాలు ఇందిరా సుడిగాలి పరిభ్రమ జలుబిబియాసిడ్లో పోసిన పన్నీరయింది నిన్నటి నిద్రలో కమ్మటి కల అయింది.

కదిలిన ఇందిరా కాంగ్రెస్‌ పునాది. కొత్తశక్తి

కాని ఇందిర గాలికన్న. రామరావు గారికన్న మార్పు కోరిక సుడిగాలిలో వీచింది అందుకే కర్నాటకలో కూడా ఇందిరా కాంగ్రెస్‌ పునాది కదిలి భవనం చెదిరి పోయింది. మార్పును ఉపయోగించుకోగల కొత్తశక్తి కర్నాటకలో కొరవడిరది, కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయగల శక్తి రాలేదు. ఆంధ్రలో ఆ కొరత రామారావు తీర్చాడు. మార్పు కోర్కెతీర్చగలనన్న విశ్వాసం కుదిరించాడు. ఇంకాం సంగతేమో కానీ ప్రతిపక్ష పార్టీలెన్నో రామారావు గాలిలో తుడిచి పెట్టుకునిపోయాయి. 35 ఏళ్లు అవిచ్చిన్న పరిపాలన సాగించిన ఇంకాం ప్రస్తుత రాష్ట్ర నాయకులు ప్రతిపక్షాలతో ఎంతకాలం కూర్చుంటారు? అనేది ప్రశ్న. కూర్చొని బాధ్యతాయుతంగా వ్యవహరించగలరా? అన్నది మరో ప్రశ్న.

వ్యక్తి కేంద్ర బిందువుగా వస్తే…

వ్యక్తి కేంద్ర బిందువుగా సాగే రాజకీయాలు మనజాలవని ఆకర్షణ అభిమానం ఆధారంగా నిలిచే ప్రజాప్రాతినిధ్యాలు కలకాలం సాగవని ఇందిరా కాంగ్రెస్‌ చ్యుతి రుజువు చేసింది. ఈ ఎన్నిక నుంచి పాఠాలు నేర్చుకోవలసింది కేవలం ఇందిరా కాంగ్రెస్‌ మాత్రమే కాదు విజయ దుందుభీలు మ్రోగిస్తున్న తెలుగుదేశం కూడా గ్రహించవలసి ఉంది. జనప్రియమైన కళాకళా సంవిధానాలు లేని చలనచిత్రాలు ఎట్లా తిప్పికొట్టబడతాయో…జనరంజకమైన, ప్రజాశ్రేయ ప్రభుత్వాన్ని ఇవ్వజాలని నాయకుల ఆకర్షణ తరిగిపోతుంది. అభిమానం కరిగి పోతుంది.

ఆకర్షణ కరిగిపోతుంది. ప్రాతిపదిక లేకపోతే నిలబడదు

వ్యవస్థా కృషి, సైద్ధాంతిక ప్రాతిపదిక లేకపోయినా జనాకర్షక విలువలపై అధికారానికి వచ్చినప్పుడు అధికారం ఆధారంగానైనా ఆ ప్రాతిపదికలు నిర్మించుకోవలసిన అవసరం ఉందనీ ఈ ఎన్నికలో పతన పరాక్రమాలు చెప్తున్నాయి. పైకి అభిమాన పౌరుషాల వల్ల చెప్పకపోయినా అన్ని పార్టీల నాయకుల మెదళ్లను ఈ అంశాలు తొలుస్తాయని వేరే చెప్పనక్కరలేదు.

వరంగల్‌ వాణి, తేది. 08-1-1983 కీలకమైన రాజకీయ సత్యం

కీర్తి శేషులు యం.ఎస్. ఆచార్యగారు 8 జనవరి 1983న వరంగల్ వాణిలో రాసిన ‘సుడిగాలి’ సంపాదకీయం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలోనే ఆ పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన రాజకీయ సత్యాన్ని గుర్తుచేసింది. ప్రజాదరణతో అధికారంలోకి రావడం ఒక దశ మాత్రమే; ఆ ప్రజాదరణను ప్రజాశ్రేయస్సుకు, సిద్ధాంతబద్ధమైన పాలనకు, సంస్థాగత బలానికి మలచుకోవడం అసలు పరీక్ష. వ్యక్తి ఆకర్షణ ఎంత గొప్పదైనా, ప్రజల ఆకాంక్షలను నిరంతరం నెరవేర్చలేకపోతే అభిమానం కరిగిపోతుందన్నది ఆచార్యగారి సంపాదకీయంలోని ప్రధాన హెచ్చరిక.

ఆనాడు ఎన్.టి. రామారావు రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు కాంగ్రెస్ నాయకత్వం ఆయన ప్రభావాన్ని మొదట తక్కువగా అంచనా వేసింది. కానీ ప్రజల్లో మార్పు కోసం ఏర్పడిన ఆకాంక్షను ఆయన రాజకీయ శక్తిగా మార్చగలిగారు. కాంగ్రెస్‌ను ఓడించడం మాత్రమే కాదు, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఒక ప్రాంతీయ రాజకీయ శక్తిని నిర్మించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.

తెలుగుదేశం పార్టీకి హెచ్చరిక

అయితే, ఆచార్యగారు విజయోత్సాహంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా ఒక ముఖ్యమైన హెచ్చరిక చేశారు: వ్యక్తి కేంద్రంగా ఏర్పడిన రాజకీయాలకు, అభిమానంపై ఆధారపడిన ప్రజాప్రాతినిధ్యానికి శాశ్వత భరోసా ఉండదు. ప్రజాదరణను వ్యవస్థాగతమైన కృషిగా, సైద్ధాంతిక ప్రాతిపదికగా, ప్రజలకు ఉపయోగపడే పాలనగా మార్చుకోవాలని సూచించారు.

చరిత్ర, ఫిరాయింపులు, అవకాశ రాజకీయ కుట్రలు, ఎన్నెన్నోకోణాలు 

నలభై మూడేళ్ల తరువాత, 2026లో, ఇదే సంపాదకీయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితులతో పోల్చి పరిశీలించడం అత్యంత సముచితం. ఎన్టీఆర్ నిర్మించిన పార్టీ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొనసాగుతున్న పార్టీ, ఇప్పుడు నారా లోకేశ్ రాజకీయ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో కనిపిస్తున్న పరిణామాలు, ఈ మూడింటి మధ్య తేడాలను చారిత్రక దృష్టితో అనేక కోణాలతో పరిశీలించాలి. అయితే, వ్యక్తులపై ఆరోపణలు చేయడం కంటే పార్టీ నిర్మాణం, నాయకత్వ వారసత్వం, సీనియర్ల పాత్ర, సిద్ధాంతాలు, ఎన్నికల హామీలు, పాలనా ప్రాధాన్యాలు వంటి అంశాలపై ఆధారాలతో విశ్లేషణ చేయవలసి ఉంటుంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *