యాసంగిలో వరి సాగు చేయొద్దు

– ప్రస్తుత పంటలను కాపాడాలి
– తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల 
– ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడం జిల్లా అధికారులతో సమీక్ష

ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: ఎల్నినో ప్రభావం వల్ల వొచ్చే కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత వానాకాలం పంటను కాపాడుకోవాలని, రాబోయే యాసంగిలో వరి సాగుకు బదులు తక్కువ నీటితో పండే పంటలను సాగు చేసేలా రైతులను సన్నద్ధం చేయాలి వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశిం చారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్లో కలెక్టర్లు దివాకర టిఎస్, అంకిత్లతో కలిసి మంత్రి తుమ్మల ఎల్సినో పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా నీటి పారు దల, మిషన్ భగీరథ, వ్యవసాయం, భూగర్భజలాలు, మార్కెటింగ్, విద్యుత్, వైద్యారోగ్య శాఖల అధికారులు తమ శాఖల ప్రస్తుత పరి స్థితులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వా రా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రువు పరిస్థితులు,
మండలాల వారీగా భూగర్భ జలాలు తగ్గు తున్న తీరుపై ప్రజలకు స్పష్టమైన సమా చారం అందించాలని అన్నారు. ఈ నెలాఖ రు నాటికి, వచ్చే నెలలో భూగర్భ జలాల పరిస్థితి ఎలా ఉండబోతుందనే అంచనాలను ప్రజలకు వివరించాలని, ప్రజలను అప్ర మత్తం చేయాలని సూచించారు.

యాసంగిలో సాగునీటి లభ్యత లేదు

రాబోయే యాసంగి సీజన్లో సాగునీటి లభ్యత ఉండే అవకాశం లేదని మంత్రి తుమ్మల తెలిపారు. రైతులు అధిక నీరు అవ సరమయ్యే వరి సాగుకు దూరంగా ఉండా లని, పప్పుధాన్యాలు, చిరు ధాన్యాలు, కూర గాయలు, ఇతర తక్కువ నీటితో పండే పంట లను సాగు చేయాలని సూచించారు. ఎక్క డా పంట వ్యర్థాలను తగులబెట్టకుండా చూడాలని, పంట వ్యర్థాలు తగులబెట్టిన
ఘటనలు చోటుచేసుకుంటే సంబంధిత అధి కారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఎల్న్ని పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని త్రాగునీటి అవ సరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించుకో వాలని మంత్రి సూచించారు. త్రాగునీటిని వాహనాల శుభ్రత, తోటల పెంపకం వంటి అవసరాలకు వినియోగించకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. నాగార్డు నసాగర్ పరిధిలోని రెగ్యులేటర్లు, షట్టర్లు, పంపిణీ వ్యవస్థలను మూసివేసి, పాలేరు వర కు ప్రధాన కాలువల్లో నీటిని నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీతా రామ ప్రాజెక్టు ప్రధాన కాలువలో మూడు పంప్ హౌస్లను వినియోగించి సాధ్యమైనం త ఎక్కువ నీటిని నిల్వ చేయాలని తెలిపారు. పాలేరు రిజర్వాయర్ మూడు జిల్లాల త్రాగు నీటి అవసరాలకు ఉపయోగపడేలా చూడా లన్నారు. దుమ్ముగూడెం టెయిల్పాండ్ సమీపంలో ఇసుక బస్తాలతో అడ్డుకట్టను పెంచి సుమారు 1 టీఎంసీ నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పత్తి, ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలి

పత్తి, ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలని మంత్రి అధికారులు ఆదేశించారు. బ్లాక్ మార్కెటింగ్, సిండికేట్లు ఏర్పడకుండా మా ర్కెటింగ్ శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ను పొదుపుగా విని యోగించాలని మంత్రి సూచించారు. వ్యవ సాయ విద్యుత్ సరఫరా సమయాలపై రైతు లకు ముందుగానే సమాచారం అందించా లని, మోటార్లకు ఏర్పాటు చేసిన ఆటో స్టార్టర్లను తొలగించాలని ఆదేశించారు. ఎండిపోయిన బోర్లను వినియోగించకుండా. చూడాలని తెలిపారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో వీధి దీపాలను దశలవారీగా సౌర విద్యుత్తో నిర్వహించే అవకాశాలను పరిశీ లించాలని సూచించారు. నీరు, విద్యుత్ వృథాను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన. కల్పించాలని అన్నారు. 1986లో సుమారు 600 గ్రామాలు వరదల కారణంగా ముం పునకు గురైన సమయంలో ప్రజలకు ఆహా రం. త్రాగునీరు అందించి అధికారులు సమ రంగా పనిచేశారని మంత్రి గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత పరిస్థితుల్లోనూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సుడా చైర్మ న్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఉఅధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *