“టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు ఫామ్ హౌస్ పాలనే లక్ష్యం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకపోవడంతో రాష్ట్రం ఎంత వెనుకబడిపోయింది. దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉంటూ వివిధ జిల్లాలను పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి లాంటి యువనాయకత్వం, ఒక కొత్త జవసత్వాలు తీసుకొచ్చింది అనడంలో సందేహం లేదు..”
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1000 రోజుల పాలనలో రాష్ట్ర ముఖచిత్రం సమూల మార్పులకు బలమైన పునాది పడింది. గత ప్రభుత్వం తెలంగాణలో చేసిన ఎనిమిది లక్షల కోట్ల అప్పుకు మిత్తికి,మిత్తిలు కడుతూ అసలు కూడా చెల్లించి ప్రయత్నాలు చేస్తూ రాష్ట్రాన్ని కొత్త దారిలో అభివృద్ధి పథంలోకి ముఖ్యమంత్రి రేవంత్ తీసుకువెళ్తున్నారు. విద్యారంగంలో, వ్యవసాయ రంగంలో, మహిళా సాధికారతలో, బలహీన వర్గాల సంక్షేమంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో కనిగిరి ఎరుగని రికార్డులు నెలకొంటున్నాయి. సీఎం రేవంత్ వెయ్యి రోజుల ప్రజాపాలన దిశగా సాగుతున్న వేళ రాష్ట్ర రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది.ఒకవైపు సంక్షేమ పథకాల అమలు, రైతు సంక్షేమం, మహిళలకు ఆర్థిక భరోసా, గృహ నిర్మాణం, మౌలిక వసతులు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుండగా.. మరోవైపు అధికార పార్టీలో వినిపిస్తున్న అసమ్మతి స్వరాలు, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ చేపడుతున్న ‘కదనభేరి’ రాజకీయ కార్యక్రమాలు ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నాయి.ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను కేవలం రాజకీయ ప్రచారానికి పరిమితం చేయకుండా, ప్రజల జీవితాల్లో ఎంతటి మార్పు వచ్చింది? ఎన్ని హామీలు నెరవేరాయి? ఎక్కడ ప్రభుత్వం విఫలమైంది? ఇంకా ఏం చేయాల్సి ఉంది? అనే ప్రశ్నలతో అంచనా వేయాల్సిన సమయం వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వానికైనా విజయాలు ఉంటాయి.. వైఫల్యాలు కూడా ఉంటాయి. వాటిని అంగీకరించి ముందుకు వెళ్లే ప్రభుత్వమే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోగలదు.వెయ్యి రోజుల రేవంత్ ప్రజాపాలనకు అసలైన విజయపతాకం నినాదాల్లోనే కాదు.. నెరవేరిన హామీల్లో, కనిపించే అభివృద్ధిలో, సంతృప్తి చెందిన ప్రజల విశ్వాసంలో కన్పిస్తుంది.అదే తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాది.
రైతుకు భరోసా.. గ్రామీణ తెలంగాణకు బలం
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు రైతు వెన్నెముక. రైతు సంక్షేమం లేకుండా రాష్ట్ర ప్రగతిని ఊహించడం సాధ్యం కాదు. రైతు భరోసా, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఉచిత విద్యుత్, సాగునీరు, పంటల ఉత్పత్తికి మద్దతు ధర వంటి అంశాలు వ్యవసాయ రంగాన్ని నిలబెట్టడంలో కీలకమైనవి. రైతు సంక్షేమం అంటే కేవలం ఒక పథకాన్ని అమలు చేయడం కాదు. రైతు పెట్టుబడి నుంచి పంట విక్రయం వరకు మొత్తం వ్యవసాయ గొలుసును బలోపేతం చేయడం.అందుకే రైతు భరోసా వంటి పథకాలతో పాటు వ్యవసాయానికి శాశ్వత మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వానికి మరింత ముఖ్యమైన బాధ్యత.ముఖ్యమంత్రి కాగానే ఒక్క సంతకంతో 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేశారు.రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సహాయంగా ఇప్పటివరకు 36 వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేశారు. అవి నేరుగా రైతుపాతాల్లోకి వెళ్లినాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడం, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లడం, రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రం గత సంవత్సరం పంజాబ్ రాష్ట్రాన్ని దాటి వరి సాగు దిగుబడిలో దేశంలో నెంబర్ వన్ గా నిలిచింది.సన్న బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్ కల్పించి రైతులకు గొప్ప మేలు చేయడం జరిగింది.
మహిళా సంక్షేమం.. కుటుంబ ఆర్థిక వ్యవస్థకు ఊతం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ పరిమితి, తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాలకు రుణాలు వంటి కార్యక్రమాలు కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించే ప్రయత్నాలుగా నిలుస్తున్నాయి.మహిళా సంక్షేమాన్ని కేవలం ఎన్నికల హామీగా కాకుండా ఆర్థిక సాధికారతకు పునాదిగా చూడాలి. మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం మాత్రమే కాకుండా వాటి ఉత్పత్తులకు మార్కెట్, శిక్షణ, సాంకేతిక సహాయం, ఉపాధి అవకాశాలు కల్పించాలి.మహిళ కుటుంబాన్ని నడిపే స్థాయి నుంచి ఆర్థిక వ్యవస్థను నడిపించే స్థాయికి ఎదగాలి.అప్పుడే మహిళా సంక్షేమం నిజమైన సాధికారతగా మారుతుంది.తాను ఎన్నికల ముందే చెప్పినట్లు రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహాలక్ష్మి పథకం ద్వారా అమలు చేయడం ఒక సంచలనం. ఈ విధంగా మహిళలు దాదాపు 11 వేల కోట్లు చేశారని అంచనాలు తెలియజేస్తున్నాయి.
వారు దూర ప్రాంతాల్లో పనిచేసుకోవడానికి ఆర్థికంగా స్వతంత్రత సాధించడానికి మహాలక్ష్మి పథకం ఎంతో మేలు చేస్తున్నది.దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనివిధంగా ఒక కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడానికి ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసింది. ఈ ప్రభుత్వం. పేద కుటుంబానికి సొంత ఇల్లు అనేది కేవలం నాలుగు గోడలు కాదు. అది భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుపై నమ్మకం.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేదలకు గృహ నిర్మాణానికి సహాయం అందించడం ప్రజాపాలనలో కీలకమైన అంశం. అయితే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సకాలంలో ప్రయోజనం చేరేలా ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. నిర్మాణానికి సంబంధించిన నిధులు, దశలవారీ చెల్లింపులు, స్థానిక సమస్యలు వంటి అంశాల్లో జాప్యం లేకుండా చూడాలి.ప్రభుత్వ పథకం కాగితంపై కనిపించడానికే పరిమితం కాలేదు.. లబ్ధిదారుడి ఇంటి గడపను తట్టి విజయాన్ని అందించింది.
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తు కు అత్యంత కీలకమైన విద్యా రంగాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తూ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు.యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం నైపుణ్యాలు ఉద్యోగాల సాధనలో కీలకమైన ముఖ్యమంత్రి విజయంలో ఒక మైల్ రాయి.రాష్ట్రంలో ఒక క్రీడా విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనుండడం ఒక గొప్ప మలుపు అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం నైపుణ్యాల శిక్షణకు క్వాలిటీ విద్య ఉద్యోగాల కల్పనకు ఇచ్చిన విజన్ ను వాళ్లు సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. కేవలం 1000 రోజుల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 72,000 పైగా ఉద్యోగాల నియామకాలు చేపట్టింది. ఇందులో రికార్డ్ స్థాయిలో ఒక మెగా డీఎస్సీ ద్వారానే 10000 పైగా ఉపాధ్యాయ పోస్టులను వివిధ స్థాయిలో భర్తీ చేశారు.
ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు అర్హులైన వైస్ ఛాన్స్లర్లు నేతృత్వం వహిస్తున్నారు. ఈ ప్రభుత్వం నైపుణ్యాల శిక్షణకు క్వాలిటీ విద్య ఉద్యోగాల కల్పనకు ఇచ్చిన విజన్ ను వాళ్లు సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారానే కనివిని ఎరుగని స్థాయిలో 5.75 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి.హైదరాబాద్ ఆర్థిక అభివృద్ధికి గుండెకాయ లాంటి ఐటి ఎగుమతులు దాదాపు నాలుగు లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇదే విధంగా ఐటీ రంగంలో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 13 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అమెజాన్ సంస్థ కూడా ఏడు బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టడానికి తెలంగాణను ఎంచుకుందంటే రేవంత్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలే నిదర్శనం.
తలసరి ఆదాయంలో తలదన్నే రికార్డులు
తలసరి ఆదాయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వము జాతీయ స్థాయిలో రికార్డులు బద్దలు కొడుతున్నది. జాతీయస్థాయి తలసరి ఆదాయం కంటే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 91శాతం అంటే దాదాపు రెండింతలు ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో 2025- 26 ఆర్థిక సంవత్సరానికి తలసరి ఆదాయము నాలుగు లక్షల 18 వేలకు పైగానే ఉంది. ఒక చిన్న రాష్ట్రం ఈ స్థాయిలో తలసరి ఆదాయం సాధించడం రాష్ట్రం ఆర్థికంగా ఎంత బలంగా ముందుకు పోతుందో ఈ ఘనంకాలే సాక్ష్యం. ముఖ్యమంత్రి ఇస్తున్న భరోసా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ పారిశ్రామిక వేస్తూ వేత్తలకు అందిస్తున్న సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం 1.3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది.సైబర్ సిటీ గచ్చిబౌలి లాంటి ప్రాంతాలకు తలదన్నే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం ముందుకు సాగుతుంది. ఇందులో ప్రత్యేకతలు ఏఐసిటి సెంటర్లు విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ప్రతిష్టాత్మక సంస్థల ప్రధాన కేంద్రాలు ఫార్మా సెంటర్లు ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో రానుండడం హైదరాబాదును అంతర్జాతీయ యవనికపై ఒక ప్రత్యేక నగరంగా తీర్చిదిద్దుతున్నాయి.ముఖ్యమంత్ రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికే ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చి ఒక బలమైన ఆర్థిక సురక్షిత రాష్ట్రాన్ని నిర్మించడానికి తన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు పథకాలు గమనిస్తే తెలంగాణ అతి త్వరలోనే ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రజానాయకుడు… ప్రజాపాలన
టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు ఫామ్ హౌస్ పాలనే లక్ష్యం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకపోవడంతో రాష్ట్రం ఎంత వెనుకబడిపోయింది. దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉంటూ వివిధ జిల్లాలను పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి లాంటి యువనాయకత్వం, ఒక కొత్త జవసత్వాలు తీసుకొచ్చింది అనడంలో సందేహం లేదు.ముఖ్యమంత్రి కాంగ్రెస్లో కీలక నేతగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి రావలసిన వనరుల సమీకరణకు ప్రాజెక్టుల అనుమతులకు కేంద్ర నాయకత్వంతో సరైన విధంగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి కావలసిన వాటిని సాధించుకు వస్తున్నారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రగతిలో ఎవరినైనా కలుస్తాను రాష్ట్రానికి రూపాయి మేలు జరిగే పని కోసం ఎంతకైనా ముందుకు వెళ్తాను అని ముఖ్యమంత్రి వ్యవహార శైలి ద్వారానే స్పష్టంగా తెలియజేస్తున్నారు. దొరల పాలన, ఫామ్ హౌస్ పాలనకు భిన్నంగా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక నిజమైన ప్రజానాయకుడిగా తెలంగాణ ఒక ఫ్యూచరిస్టిక్ తెలంగాణ రాష్ట్రంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి సంక్షేమము అభివృద్ధి భవిష్యత్తు ప్రణాళికలతో తనదైన విశిష్ట శైలిలో ఈ రాష్ట్రానికి కొత్త రూపునిస్తున్న రేవంత్ రెడ్డి అభినందనీయులు.
తెలంగాణ సీఎం ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజల మధ్యనే ఉంటారు, ప్రజలతో ప్రతిరోజు మమేకమవుతారు, అభివృద్ధి, నిరంతరం పేదల సంక్షేమమే ప్రాణంగా భావిస్తారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యంగా యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ఆహరహారం శ్రమిస్తున్న రేవంత్ రెడ్డి పాలన రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మరింత మోదం కలిగిస్తున్నాడటంలో సందేహం లేదు. అదేవిధంగా కాంగ్రెస్ లోని అసమ్మతిని బలహీన తగా మార్చుకునే అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వకుండా కొరడా దులిపించాల్సిన అవసరం ఉంది, బిఆర్ఎస్ చేస్తున్న వెయ్యి రోజుల పాలన పై ‘కదనబేరి’ రాజకీయ శబ్దం ఎంత పెంచినా… ప్రజల కోసం తెచ్చిన మార్పు, ప్రజల జీవితాల్లో వెలుగులు నిజమైన సమాధానం. కేవలం అధికార వ్యతిరేకతను బూచిగా చూపెట్టి, గోబెల్స్ ప్రచారంతో రాజకీయ పునరాగమానం సాధ్యం కాదు. రేవంత్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఒక్కొక్కటిగా 27 నెలల కాలంలో పూర్తి చేసి, భవిష్యత్తుకు బాట వేస్తారని ఆశిద్దాం.





