Tag Farmers

గ్రామీణ భారతంలో సంక్షోభం ..!

భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దేశ ఆర్థికాభివృద్ధికి వెన్నెముక. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, గ్రామీణ ఉపాధి, చిన్న వ్యాపారాలు—ఇవన్నీ కలిసి గ్రామీణ జీవనాన్ని నడిపిస్తాయి. అలాంటి గ్రామీణ కుటుంబాల ఆదాయ వృద్ధి మందగించడం, అనధికారిక అప్పులపై ఆధారపడటం పెరగడం ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాదు, సామాజిక స్థిరత్వానికీ ఆందోళనకర సంకేతం. నాబార్డ్ తాజాగా విడుదల…

ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ కష్టకాలం

వ్యవసాయం ప్రకృతిపై ఆధారపడిన జీవన విధానం. వర్షం సకాలంలో కురిస్తే రైతు ఇంట ఆనందం వెల్లివిరుస్తుంది.వర్షం ముఖం చాటేస్తే అదే రైతు జీవితంలో ఆందోళన మొదలవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎర్లీ ఎల్‌నినో ప్రభావం ఖరీఫ్ వ్యవసాయంపై ఆందోళన కలిగిస్తోంది. మాన్సూన్ ప్రారంభంలోనే వర్షపాతం తీరులో కనిపిస్తున్న అస్థిరత రైతులను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టుతోంది. ఒకవైపు వర్షాలు…

వానలు పడేట్లులేవు.. కుదేలవుతున్న రైతాంగం

వానాకాలంలో ఎండలు కాస్తున్నాయి. ప్రాజెక్టుల్లో నీళ్ళు అడుగంటాయి. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఆకాశంవైపు చూస్తూ దిగాలుపడుతున్న ప్రజలు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి పరిస్థితి ఇది. నైరుతి రుతుపవనాల ప్రభావం ఆశించిన స్థాయిలో లేకపోవడం, లెనినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితి నెలకొందని శాస్త్రవేత్తలు చెబుతున్న తీరు చూస్తే వర్షాలపైన ఆశవదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.…

పేదరైతుకు అందుతున్న ‛భరోసా’ ఎంత?

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడి సహాయం అనేది రైతులకు కేవలం ఒక ఆర్థిక ఊరట మాత్రమే కాదు. అది రాష్ట్ర రాజకీయ గమనాన్ని శాసించే అత్యంత శక్తివంతమైన సాధనంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018లో ప్రారంభమైన ‘రైతుబంధు’ పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10,000, రెండు విడతలలో రూ. 5,000 చొప్పున…

కాళేశ్వ‌రం వివాదం మ‌ధ్య న‌ష్ట‌పోతున్న రైతులు

Kaleshwaram Controversy Leaves Farmers in Distress Examining the Impact

తెలంగాణ సాగునీటి రంగ ముఖచిత్రాన్ని మార్చేస్తుందని ప్రచారం చేసిన ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం’  నేడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక మహా రణరంగంగా మారింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కుంగుబాటు, లీకేజీల చుట్టూ తిరుగుతున్న వివాదం… ఇంజనీరింగ్ లోపాల నుండి రాజకీయ కక్షసాధింపుల వైపు మళ్ళింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ ఏ) నివేదికల ప్రకారం…

ఎల్ నినో గండంతో ఖరీఫ్ ఢమాల్

కరువు నివారణకు  సంసిద్ధత  కరువు పత్రికలలో, టీవీ, ఇతర మాధ్యమాలలో  ప్రధాన వార్త   రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావం ఎక్కువగా  ఉంటుందని, ఇంకా  కొన్ని పత్రికలు ఈ వారంలో విస్తారంగా  వర్షాలు కురుస్తాయని వార్తలు రాస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలలో ముప్పై జిల్లాల్లో   ఇంతవరకు నేల తడవలేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.ఏరువాకకు ఎల్‌‌నినో…

కార్మిక, కర్షక లోకానికి కేసీఆర్ మే డే శుభాకాంక్షలు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 30ః అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే . చంద్రశేఖర్ రావు గారు కార్మిక కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు. చారిత్రాత్మక మే…

కేంద్ర బడ్జెట్ నిరాశాజనకం

“రూ.45.48 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌లో కీలక రంగాల్లో తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయింపులు లేకపోవడం అన్యాయం. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, జీహెచ్‌ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కేంద్ర సహకారం లభించలేదు. 10,000 కోట్ల బయోఫార్మా శక్తి పథకంలో, జీనోమ్ వ్యాలీ వంటి బలమైన బయోఫార్మా వ్యవస్థ, టీకా తయారీలో…

అసమర్థ పాలనతో రైతులకు ఇబ్బందులు

– రిటైర్‌ అయిన వారికి పెన్షన్‌ లేదు.. బెనిఫిట్స్‌ లేవు – లా అండ్‌ ఆర్డర్‌లో పూర్తి వైఫల్యం – బీఆర్‌ఎస్‌ జీరో అయ్యింది – మీడియా సమావేశంలో బీజేపీ చీఫ్‌ రామచందర్‌ ఆగ్ర‌హం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: బ్రిటిషర్ల అణచివేతకూ, నైజాం దమనకాండకీ ఎదురు నిలబడి పోరాడిన తెలంగాణ యోధుడు కుమ్రం భీం…