కార్మిక, కర్షక లోకానికి కేసీఆర్ మే డే శుభాకాంక్షలు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 30ః అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే . చంద్రశేఖర్ రావు గారు కార్మిక కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు. చారిత్రాత్మక మే డే స్ఫూర్తితో బీఆర్ఎస్ ప్రభుత్వం, సబ్బండ కులాల కర్షక కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానాలను అమలు చేసిందని అన్నారు. సింగరేణి, ఆర్టీసీ, భవన నిర్మాణ రంగం సహా పలు రంగాలకు చెందిన కార్మికులు, ఆటో డ్రైవర్లు, దినసరి కూలీలు, అసంఘటిత రంగ కార్మికుల కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కేసీఆర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వినూత్న పారిశ్రామిక విధానాల ద్వారా తెలంగాణలో సంపద సృష్టించడంతో లక్షలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించాయని కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నాటి పదేండ్ల ప్రగతి కార్యాచరణను మరింత పటిష్టంగా అమలుచేయడమే రాష్ట్ర కార్మిక లోకానికి మనమిచ్చే గొప్ప కానుక అని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *