– ఈనెల 8 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
– ఈఏపీసెట్-2026 పరీక్షలో అర్హత సాధించిన వారికే
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో అగ్రికల్చర్ కోర్సులో 60 స్పాన్సర్డ్ సీట్లలో ప్రవేశం కోసం ఈ నెల 8వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశం కోసం https://ug.mjptbcwreis.net ద్వారా ఈనెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్ బీపీసీ గ్రూప్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణతతోపాటు టీజీ ఈఏపీసెట్-2026లో అర్హత సాధించిన అభ్యర్థులు బీసీ అయి మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల సొసైటీ జూనియర్ కళాశాలల్లో అభ్యసించి ఉండాలన్నారు. లేదా బీసీ సంక్షేమ వసతి గృహాల్లో బోర్డర్లుగా చేరి ఇంటర్ చదివిన విద్యార్థినీవిద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు ప్రాస్పెక్టస్, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ కోసం https://ug.mjptbcwreis.net లేదా https://mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. విద్యార్థులు గ్రామీణ ప్రాంతానికి చెందినవారైతే వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1,50,000లు, పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదని ఆయన తెలిపారు. దరఖాస్తు రుసుము రూ.200 ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించాలని, అవసరమైన అన్ని ధ్రువపత్రాలను దరఖాస్తుతోపాటు అప్‌లోడ్ చేయాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక టీజీ ఎప్‌సెట్-2026 ర్యాంకుల ఆధారంగా జరుగుతుందన్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఆఫీస్ పని దినాల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు 040-23328266 నంబరులో హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలి లేదా mjpadmissioncell@gmail.com కు మెయిల్ పంపాలని కార్యదర్శి సైదులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





