అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక 

– ప్రజలకు  రేవంత్‌రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. చెండుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయ దశమి అని అన్నారు. దసరా పండుగ మనకు ధైర్యం, ధర్మం, సత్యం, ఐకమత్యం, ఆత్మవిశ్వాసం వంటి గొప్ప విలువలను బోధిస్తుందన్నారు. మనలోని అహంకారం, అసూయ, ద్వేషం, అన్యాయం వంటి చెడు లక్షణాలను తొలగించుకుని, ప్రేమ, కరుణ, సోదరభావం, మానవత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ పండుగ సందేశమిస్తోందని అన్నారు. ఈ విజయదశమి ప్రతి ఇంటా ఆనందాల పూలు పూయించాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి దుష్టశక్తులపై విజయం సాధించిన అమ్మవారి శక్తిని, శ్రీరాముడు రావణాసురుడిపై సాధించిన విజయాన్ని ఈ పర్వదినం మనకు గుర్తు చేస్తుందన్నారు. తెలంగాణలో దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు చేయడం, జమ్మి ఆకులను బంగారంగా భావించి పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవడం ప్రత్యేక సంప్రదాయమని గుర్తు చేశారు. ఈ ఆచారం ప్రకృతిని ప్రేమించాలని, పెద్దలను గౌరవించాలని చాటిచెబుతుందని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *