సీజేపీ నాయకుల విడుదలలో ప్రతిష్టంభన

– సీజేపీ నాయకుల విడుదలలో ప్రతిష్టంభన
– ప్రాణహాని వుందంటూ తప్పుకున్న మెజిస్ట్రేట్
– సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల కేసు కొత్త మేజిస్ట్రేట్ ముందుకు
– విచారణలో జాప్యంపై అభిజీత్ దీప్కే ఆగ్రహం
– దిల్లీ హైకోర్టుకు నేహా బోరా
– మెటాకు  కేంద్రం సూచనలు
– పోలీసుల చర్యలపై కొత్త వివాదం

ప్రజాతంత్ర ప్రత్యేక వార్త | దిల్లీ | అక్టోబర్ 19 : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో కొనసాగుతున్న నిరసనల్లో సోమవారం సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల విడుదల వ్యవహారం ప్రధాన అంశంగా మారింది. ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో ఇద్దరినీ కొత్త ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచేందుకు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ జరగాల్సి ఉండగా, మధ్యాహ్నం 2.47 గంటల వరకు విడుదలపై నిర్ణయం వెలువడినట్లు ధ్రువీకరణ లభించలేదు.

బెదిరింపుల కారణంగా విచారణ నుంచి తప్పుకున్న మేజిస్ట్రేట్

సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల విడుదలకు సంబంధించిన విచారణను నిర్వహించాల్సిన ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ కేసు విచారణ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. మేజిస్ట్రేట్‌కు బెదిరింపులు వొచ్చాయన్న ఫిర్యాదుపై గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బెదిరింపులకు ఎవరు పాల్పడ్డారన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. మరోవైపు సీజేపీ న్యాయవాదులు సమర్పించిన పూచీకత్తులను తిరస్కరించడం, విచారణలో ఆలస్యం  జరగడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. న్యాయ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని సీజేపీ ఆరోపించింది. పోలీసులు ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ చట్టపరమైన విధానాన్నే అనుసరిస్తున్నామని తెలిపారు.

సహచరులకు దీప్కే సందేశం

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోమవారం తన సహచరుల విడుదలను కోరుతూ భావోద్వేగపూరిత సందేశం ఇచ్చారు. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, వారి నిర్బంధం ప్రజాస్వామ్య హక్కులపై జరుగుతున్న పోరాటాన్ని ఆపలేదని పేర్కొన్నారు. ఇద్దరి విడుదలలో జరుగుతున్న జాప్యానికి ప్రభుత్వ యంత్రాంగమే కారణమని దీప్కే ఆరోపిస్తున్నారు.

పోలీసు నోటీసుపై హైకోర్టుకు నేహా బోరా

విద్యార్థి నాయకురాలు నేహా బోరా తనకు దిల్లీ పోలీసులు జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ సోమవారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర విచారణ చేపట్టాలని ఆమె న్యాయవాదులు కోరారు.అక్టోబర్ 16న దిల్లీలో నిర్వహించిన జాతీయ పతాక ప్రదర్శనకు సంబంధించి మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు తాజా వార్తా కథనాలు పేర్కొన్నాయి. నిరసనల నేపథ్యంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు మరికొన్ని కేసులు నమోదు చేసినట్లు వెల్లడైంది.

మెటాకు కేంద్రం సూచనలు.. సోషల్ మీడియా చర్చ

దిల్లీలో నిరసనలు కొనసాగుతున్న సమయంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాకు కీలక సూచనలు జారీ చేసింది.  సోషల్ మీడియా అల్గారిథమ్‌ల ద్వారా ఒకే కథనానికి అధిక ప్రాధాన్యం కల్పించే విధంగా కంటెంట్‌ను సిఫార్సు చేయవొద్దని కేంద్రం సూచించింది.

మరో ఐదు రోజుల కస్టడీ కోరిన దిల్లీ పోలీసులు

సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను మరో ఐదు రోజులపాటు కస్టడీలో ఉంచాలని దిల్లీ పోలీసులు కోరినట్లు తెలుస్తుంది . ఇద్దరూ మరో నిరసనకు పిలుపునిచ్చే అవకాశం ఉందని పోలీసులు వాదించారు. అయితే తాము కొత్త కార్యక్రమానికి పిలుపునివ్వలేదని సీజేపీ నాయకులు పేర్కొన్నారు.  నేహా బోరాకు సంబంధించిన కేసులో రూ.10 వేల శాంతిభద్రతల పూచీకత్తు, ఒక ష్యూరిటీ సమర్పించాలన్న నోటీసును ఆమె సవాలు చేశారు. దిల్లీ హైకోర్టుకు అక్టోబర్ 26 వరకు సెలవులు ఉన్నందున అత్యవసర విచారణ కోరుతున్నారు.నవంబర్ 1న ఇండియా కూటమి భారీ సభలోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎస్ఐఆర్ వ్యతిరేక ఉద్యమాన్ని విస్తరించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు కొనసాగిస్తోంది. నవంబర్ 1న దిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు దిల్లీ పోలీసులు నిరభ్యంతర పత్రం జారీ చేశారు. 25 నుంచి నవంబర్ 3 వరకు సభ ఏర్పాట్లకు సంబంధించిన కాలపరిమితిని అనుమతిలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ గతంలో ప్రకటించిన కార్యాచరణ ప్రకారం 10 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించాలి. వోటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించబడిన వ్యక్తులను గుర్తించి, తిరిగి నమోదు చేసుకునేందుకు సహాయం చేయడం కూడా ఈ కార్యక్రమంలో భాగం. నవంబర్ 1 సభకు ఇండి కూటమి పార్టీల నాయకులను ఆహ్వానించారు.

నవంబర్ 1న ఇండి కూటమి భారీ సభ

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎస్ఐఆర్ వ్యతిరేక ఉద్యమాన్ని విస్తరించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు కొనసాగిస్తోంది. నవంబర్ 1న దిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు దిల్లీ పోలీసులు నిరభ్యంతర పత్రం జారీ చేశారు. 25 నుంచి నవంబర్ 3 వరకు సభ ఏర్పాట్లకు సంబంధించిన కాలపరిమితిని అనుమతిలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ గతంలో ప్రకటించిన కార్యాచరణ ప్రకారం 10 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించాలి. వోటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించిన వ్యక్తులను గుర్తించి తిరిగి నమోదు చేసుకునేందుకు సహాయం చేయడం కూడా ఈ కార్యక్రమంలో భాగం. నవంబర్ 1 సభకు ఇండి కూటమి నాయకులను ఆహ్వానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *