– దశలవారీగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తాం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– 18న ‘చలో హైదరాబాద్’ వాయిదా : సివిల్ కాంట్రాక్టర్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : రాష్ట్రంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రజా ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో స్పందిస్తోందని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, సివిల్ కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎంను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేయగా ఉ| Ÿముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. చిన్న కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ఆర్థిక శాఖ ప్రతినెలా నిరంతరాయంగా బిల్లులను చెల్లిస్తోందని గుర్తు చేశారు. బకాయిల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందన్నారు. రాష్ట్రంలో చిన్న కాంట్రాక్టర్లకు దశలవారీగా పెండింగ్ బిల్లులన్నింటినీ పూర్తిగా చెల్లించి చిన్న కాంట్రాక్టర్లను ఆదుకుంటామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. అంతకుముందు కాంట్రాక్టర్ల ప్రతినిధులు రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనూ చర్చలు జరిపారు. అనంతరం ప్రజాభవన్‌కు చేరుకుని మంత్రి కోమటిరెడ్డితో జరిగిన చర్చల సారాంశాన్ని డిప్యూటీ సీఎంకు వివరించారు.
‘చలో హైదరాబాద్’ వాయిదా: రవీందర్ రెడ్డి
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన సానుకూల హామీతో తాము సంతృప్తి చెందామని, ఈ నెల 18న చేపట్టదలచిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర చైర్మన్ రవీందర్ రెడ్డి ప్రకటించారు. తమ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా. అండగా నిలిచిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆరఅండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు వి.సత్యమూర్తి, జాతీయ మాజీ అధ్యక్షుగు ఎస్.ఎన్.రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుcT డి.వి.ఎన్.రెడ్డి, సుగుణాకర్ రావు, భాస్కర్‌రెడ్డి, సంతోష్ రెడ్డి, ప్రభాకర్, శ్యామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




