ప్రపంచ పెట్టుబడులే లక్ష్యంగా ‘గ్లోబల్ సమ్మిట్’

– తెలంగాణ ప్రతిష్ఠను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలి
– అధికారులకు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీలలో జరగబోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2.0కు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలు సమన్వయంతో పనిచేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ కోసం ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన వార్ రూమ్‌ను శుక్రవారం ఆయన సందర్శించి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులకు అప్పగించిన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. శాఖల మధ్య నిరంతర సమాచార మార్పిడి, సమన్వయం ఉండేలా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమ్మిట్ విజయవంతానికి ప్రతి శాఖ కృషి చేయాలన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రతిష్ఠను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రతి అధికారి సమష్టి బాధ్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. భట్టి విక్రమార్క వెంట ఆర్థిక, ప్లానింగ్ ముఖ్య కార్యదర్శి గౌరవ్ ఉప్పల్‌తోపాటు ఇతర శాఖల అధికారులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *