హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 05 : విద్యతోపాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. నాలుగు దశాబ్దాలుగా సమాజ సేవలో నిమగ్నమైన మహిళా దక్షత సమితి విద్యాసంస్థలను గవర్నర్ సందర్శించారు. మహిళలకు ఉన్నతవిద్య అందించి, వారికి సాధికారత కల్పించాలన్న లక్ష్యం సంస్థ గొప్పదని, మహిళా విద్యతో పాటు సామాజికంగా వారిని పైకితేవడంలో అపార కృషి అభినందనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంబీజీ గ్రూప్ ఛైర్మన్ బిజయ్ మంధాని, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినోద్ కె.అగర్వాల్, పారిశ్రామికవేత్త, ఎండీఎస్ ట్రస్టీ ప్రకాష్ గోయెంకా, గూగుల్ మ్యాప్స్ సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ విజయ్ కుమారస్వామి, ఎండీఎస్ సెక్రటరీ అరుణా మలానీ, జయా బహేతి, రాజ్ శ్రీ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులు కె.సాయి సత్యవేణి, శృతి, అలేయమ్మ సారా, బి.నీహారిక, జి.మాధవి లకు గవర్నర్ మెమెంటోలు బహూకరించారు.





