– 25న కాంక్లేవ్, పోస్టర్ ఆవిష్కరణ
ఖైరతాబాద్, జూలై 21(ప్రజా తంత్ర): ప్రజా సంక్షేమం కోసం సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలు అందించిన సీనియర్ రాజకీయ నాయకులను సత్కరించే లక్ష్యంతో లార్వేన్ క్రాఫ్ట్స్ సంస్థ తొలిసారిగా స్టేట్స్‌మెన్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 65 ఏళ్లు పైబడిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపిక చేసిన రాజకీయ నాయకులకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 25వ తేదీన అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన స్టేట్స్‌మెన్ ఎక్స్‌లెన్స్ కాంక్లేవ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంస్థ గౌరవ సలహాదారు, సీనియర్ పాత్రికేయులు, మాజీ ఆర్టీఐ కమిషనర్ విజయ్ బాబు అధ్యక్షత వహించగా, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు విజయ్‌కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. విశిష్ట అతిథులుగా మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, హైడ్రా పీఆర్వో వేణుగోపాల్ నాయుడు, తెలంగాణ మాసపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కోడూరి శ్రీనివాస్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, ప్రజా జీవితంలో విశేష సేవలు అందించిన రాజకీయ నాయకులను గుర్తించి అవార్డులతో సత్కరించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన లార్వేన్ క్రాఫ్ట్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శివాల గిరిబాబును ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో లార్వేన్ క్రాఫ్ట్స్ సంస్థ క్రియేటివ్ డైరెక్టర్ సుధా జైన్, నిర్వహణ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కార్యనిర్వహణ విభాగం ప్రతినిధులు నాగేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





