నిరుద్యోగ యువతకు ఉపాధే ఉత్తమ్ లక్ష్యం

– శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి

కోదాడ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువతకైనా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించా లనే తపనతోనే మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహించారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. కోదాడలోని శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఆయన మాట్లాడారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించి, యువతను కలుసుకునే అవకాశం కల్పించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిరుద్యోగ యువతకు వారి అర్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇలాంటి కార్యక్ర మాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

రైతుల సంక్షేమమే లక్ష్యం

నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డ  ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంతోపాటు రైతులు పంటలను కాపాడేందుకు కృషి చేస్తున్నారని గుత్తా అన్నారు. రైతులు రెండు పంటలు సాగు చేయాలని ఎదురు చూస్తున్నారని, సాగులో ఉన్న పంటలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలనే లక్ష్యంతో మంత్రి పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రైతుల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎప్పటికప్పుడు చర్చిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయ‌న చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *