బీహార్ అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట

– ఏడుగురు భక్తుల దుర్మరణం

పాట్నా, ఆగస్టు 17 : బీహార్‌లో విషాదం చోటుచేసుకుంది. లఖిసరాయ్ జిల్లాలోని అశోక్‌ధామ్ ఆలయంలో సోమవారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. శ్రావణమాసం సోమవారం కావడంతో ఈ శివాలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. అయితే వారి మధ్యలో ఒక విద్యుత్‌ వైర్ తెగిపడిపోవడంతో ఒక్కసారిగా భయపడిపోయారు. షాక్ కొడుతుందనే ఆందోళనతో అక్కడినుంచి బయటకు పరిగెత్తే క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడినవారిని సమీప హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సత్వర చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చారు. దానికి తగ్గట్టే మేం ఏర్పాట్లు చేశాం. భయాందోళన కారణంగా వారు పరుగెత్తడంతో బారికేడ్లు పడిపోయాయి. దాంతో ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ ఘటనకు ఎలక్ట్రిక్ వైర్ కారణంగా తెలుస్తోంది. ధ్రువీకరించుకున్న తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని లఖిసరాయ్ డిస్ట్రిక్ట్ మేజిస్టేట్ర్ శైలేంద్ర కుమార్ వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *