డిప్యూటీ సీఎంకు ‘సదర్ సమ్మేళన్‌’ ఆహ్వానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద గల ఎన్టీఆర్ స్టేడియంలో నవంబర్ 4న జరగనున్న సదర్ సమ్మేళన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు. ప్రజాభవన్‌లో గురువారం ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉదయం 11 నుంచి రాత్రి 7:30 గంటల వరకు యాదవ సోదరుల ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఉత్సవ కమిటీ సభ్యులు కార్పొరేటర్ శంకర్ యాదవ్, పాండు యాదవ్, ప్రసాద్ యాదవ్, ప్రవీణ్ యాదవ్, రాజేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *