అద్దెలు వ‌సూలు కాక‌ రూ.2 కోట్ల నష్టం

  • కవర్ షెడ్ మడిగెలకు అగ్రిమెంటు చేయకుండానే అద్దెలు ఖరారు
  • అద్దెల వసూలు పట్టని వరంగల్ మార్కెట్ కమిటీ అధికారులు
  • స్టాక్ పాయింట్లుగా ఉపయోగం.. బినామీలకు అద్దెకు
  • అప్పగిస్తే నెలకు రూ.2లక్షల అద్దెలు చెల్లిస్తామంటున్న రిటైల్ వ్యాపారుల సంఘం

వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: వరంగల్ లక్ష్మీపురంలోని మోడల్ కూరగాయల మార్కెట్‌లో రిటైల్ వ్యాపారుల కోసం కవర్‌షెడ్‌లో నిర్మించిన 158 ప్లాట్ల(మడిగెల)ను 2022 ఫిబ్రవరిలో కేటాయించారు. అగ్రిమెంటు చేయకున్నా మార్కెటింగ్ ఇంజనీరింగ్ అధికారులు ఒక్కో మడిగెకు రూ.2300లుగా అద్దెగా ఖరారు చేశారు. అంత అద్దె కట్టలేమని, తగ్గించాలని వ్యాపారులు కోరగా మార్కెట్ కార్యదర్శి ఉన్నతాధికారులకు ఫైల్ పెట్టగా అందుకు డైరెక్టర్ తిరస్కరించినట్లు సమాచారం. నిర్ణయించిన ప్రకారం అద్దె

లు వసూలు చేయాలని మార్కెట్ కార్యదర్శి ఆదేశాలు జారీ చేయడమే తప్ప ఏనాడూ కూరగాయల మార్కెట్‌కు వెళ్లి పర్యవేక్షించింది లేదు. ఈ కారణంగా వసూళ్ల కోసం సెక్యూరిటీ గార్డులు వెళితే వ్యాపారులు బెదిరించడంతో వారు మిన్నకుండిపోయారు. మార్కెట్ అధికారులు నిర్లక్ష్యంతో అద్దెలు వసూలు జరగడం లేదు. దీనివల్ల మడిగె ఒక్కింటికి రూ.2300ల అద్దె చొప్పున 158 మడిగెలకు ప్రతి నెలా రూ.3,63,400లు మార్కెట్ కమిటీ ఆదాయం కోల్పోయింది. అంటే 2022 ఫిబ్రవరి నుంచి 2026 అక్టోబర్ వరకు 56 నెలలకు రూ.2,03,50,400లు ఆదాయం కోల్పోయినట్లు చెప్పవచ్చు. రూ.కోట్లలో అదాయం కోల్పోతున్నా మార్కెట్ కమిటీ పాలకవర్గం, మార్కెటింగ్ అధికారుల పట్టింపులేనితనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్టాక్ పాయింట్లుగా ఫ్లాట్లు 

కవర్ షెడ్‌లోని 158 మడిగెలలో పది మంది వరకు తమకు కేటాయించిన ప్లాట్లలో వ్యాపారం చేసుకుంటున్నారు. వీరిలో ఇద్దరు ముగ్గురు కొంత అద్దెలు కట్టగా మిగిలిన వారు బెదిరింపులకు పాల్పడి అద్దెలు చెల్లించడం లేదని తెలిసింది. కవర్ షెడ్ హమాలీలు, వ్యాపారుల మోటారు సైకిళ్లకు పార్కింగ్‌గా మారింది. కొంతమంది తమ ఫ్లాట్లను కూరగాయల బస్తాలు పెట్టుకునేందుకు స్టాక్ పాయింట్లు

గా అద్దెలకు ఇచ్చుకున్నట్లు తెలిసింది. ఈ విషయం కూరగాయల మార్కెట్ సిబ్బందికి, అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం గమనార్హం. ఇటీవల ఇన్‌చార్జి జెడీఎంగా బాధ్యతలు చేపట్టిన అదనపు డైరెక్టర్ లక్ష్మణుడు కూరగాయల మార్కెట్‌ను సందర్శించిన సమయంలో అద్దెలు కట్టని వారు తమ పేర్లను ఎలా రాసుకున్నారని మార్కెట్ అధికారులు ప్రశ్నిస్తే వారి నుండి సమాధానం లేదు.

నెలకు రూ.2 లక్షలు అద్దె చెల్లిస్తాం 

అద్దెలు చెల్లించకుండా ఖాళీగా ఉన్న కవర్ షెడ్‌లోని ఫ్లాట్లను తమ సంఘానికి అప్పగిస్తే నెలకు రూ.2లక్షలు అద్దె చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని రిటైల్ వ్యాపారుల సంఘం నాయకులు బహిరంగంగానే అంటున్నారు. ఈ విషయాన్ని మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌కు, మార్కెట్ కార్యదర్శి దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదంటున్నారు. రిటైల్ వ్యాపారులు ఫ్లాట్లు లేక షాపుల ముందు అద్దెలు తీసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారని, అదే కవర్ షెడ్‌లో ఫ్లాట్లు మొత్తం కేటాయిస్తే సంఘం పక్షాన ప్రతి నెలా రూ.2లక్షల అద్దెలు చెల్లిస్తామని చెబుతున్నారు. స్థానిక అధికారులు పట్టించుకోకుంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతోపాటు రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

కవర్ షెడ్‌లో గంజాయి తాగి మృతి

కవర్‌షెడ్ ఖాళీగా ఉండడంతో రాత్రి వేళల్లో ఆసాంఘిక శక్తులకు అడ్డాగా మారడమే కాక గంజాయి తాగి వచ్చి పడుకుని ఇప్పటికే ముగ్గురు మృతిచెందారు. ఎలాంటి ఆధారం లేని వారికి అడ్డాగా మారింది. బస్టాండ్ కూలగొట్టడంతో అక్కడ రాత్రివేళల్లో పడుకునే పరిస్థితి లేని వారికి ఇది నెలవుగా మారింది. పోలీసులు పెట్రోలింగ్ చేయకపోవడం వల్ల మార్కెట్ పరిసరాల్లో రాత్రివేళల్లో రైలు దిగివచ్చే వారిపై దాడులు జరగడమే కాక ఒకరు హత్యకు గురయ్యారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు దృష్టి పెట్టకపోవడంతో కవర్ షెడ్ జులాయిలకు, గంజాయి తాగే వారికి అడ్డాగా మారిందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *