నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

– విద్యార్థులకు ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఉద్బోధ
– కిట్స్‌లో ‘సమ్‌శోధిని-26’ జాతీయ సాంకేతిక సింపోజియం ప్రారంభం

హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : విద్యార్థులు ఆత్మగౌరవాన్ని, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ కిట్స్‌లో ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఐఎస్‌టీఈ) కిట్స్ స్టూడెంట్ చాప్టర్, టెక్నికల్ క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్(సాక్), 11 ఇంజనీరింగ్, ఎంబీఏ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయి విద్యార్థి సాంకేతిక సింపోజియం ‘సమ్‌శోధిని-26’ అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, విశిష్ట అతిథిగా కిట్స్ పూర్వ విద్యార్థి (1990), టీసీఎస్ అకడమిక్ అలయన్సెస్(హైదరాబాద్) రీజియన్ హెడ్ రిచర్డ్ కింగ్ చత్రగడ్డ హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. వరుణ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి పని సంస్కృతి, విలువలు, పాఠ్యపుస్తకాలను చదవడం ద్వారా ప్రాథమిక అంశాలపై పటిష్టమైన జ్ఞానం, సూక్ష్మ స్థూల లక్ష్యాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రజలతో భౌతికంగా, భావోద్వేగపరంగా అనుసంధానమై ఉండాలని సూచించారు. విద్యార్థులు వినూత్న ఆలోచనలు, స్టార్టప్‌లతో ముందుకు రావాలని, ఇవి వారిని టెక్నాలజీలో మంచి నాయకులుగా, విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాయని సూచించారు. చత్రగడ్డ మాట్లాడుతూ సమస్యా పరిష్కార నైపుణ్యం అత్యంత ముఖ్యమైనదని, సంక్లిష్టమైన విషయాలను పరిష్కరించగలిగేలా మార్చడం, జీవిత నైపుణ్యాలు ఎంతగానో అవసరమని అన్నారు. అయితే ఉద్యోగం సంపాదించడంలో నిజమైన నైపుణ్యాలు కీలకమని సూచించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ ‘సమ్‌శోధిని’26 థీమ్ ‘సాంప్రదాయ ఆలోచనలకు అతీతంగా’ సాంకేతిక పరిశోధన ద్వారా అన్వేషణ, ఆవిష్కరణకు ముఖ్యమైన సమస్యలను గుర్తించడం అవసరమని తెలిపారు. 11 విభాగాలు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వీఎలఎసఐ- ఈసీవి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కూడిన ఇంజనీరింగ్ విభాగాలు ఎంబిఎ వారు వివిధ సాంకేతకపరమైన 12 వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారని తెలిపారు. కిట్స్ అడిషనల్ సెక్రటరీ వి.సతీష్ కుమార్ అధ్యక్షోపన్యాసం చేస్తూ విద్యార్థులు స్వీయ క్రమశిక్షణ, ఏకాగ్రత కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో 52 కళాశాలల నుంచి 1707 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఫెస్ట్ కన్వీనర్, డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ కె.శ్రీధర్ మాట్లాడుతూ సంవత్సరానికి రూ.5 లక్షల విలువైన గ్రంథాలయంలో అందుబాటులో ఉంచిన పరిశోధన జర్నల్స్ కాపీలను ఉపయోగించుకుని విద్యార్థులు తమ జ్ఞానాన్ని నవీకరించుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో కిట్స్ యాజమాన్య సభ్యుడు, పారిశ్రామికవేత్త ఇ.వెంకట్రామ్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.కోమల్‌రెడ్డి, డీన్ స్టూడెంట్ ఎఫైర్స్ అండ్ ప్రోగ్రాం కన్వీనర్ ప్రొఫెసర్ కె.శ్రీధర్, ఐఎస్‌టిఈ కిట్స్ చాప్టర్ చైర్మన్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి.మధుకర్ రెడ్డి, కో-కోఆర్డినేటర్స్ డాక్టర్ ఎస్.సునీల్ ప్రతాప్ రెడ్డి, బి.శశికాంత్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ, పిఆరఓ డా.డి.ప్రభాకరాచారి, డీన్‌లు, వివిధ విభాగాల హెచఓడీలు, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు, ఐఎస్‌టిఈ కిట్స్ విద్యార్థి చాప్టర్ ప్రెసిడెంట్ కె.సాయి సిద్ధార్థ రెడ్డి, టెక్నికల్ క్లబ్ విద్యార్థి అధ్యక్షుడు నిఖిల్ మాదరవేన, విద్యార్థులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *