– ముఖ్య అతిథిగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– సింగరేణి ఎన్నికలు నిర్వహించాలి
– బోనస్ గా లాభాల్లో పూర్తి వాటా అందించాలి
– ఇచ్చిన హామీలు తీర్చాల్సిందే
– బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీష్‌రావు డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కార్మిక గర్జన పేరుతో ఈనెల 14న రామగుండంలోనిర్వహించే భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, ఈ సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ఎల్పీ డిప్యూట్ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ లో టీబీజీకేఎస్, సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో గురువారం జరిగిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నదని విమర్శించారు. కార్మికు
ఉత్పత్తి ఎందుకు తగ్గిందో?
2024–25లోొ ఇచ్చింది 12.5శాతం మాత్రమే. అంటే కార్మికులకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. అవినీతి, బంధుప్రీతి, పరిపాలన వైఫల్యం వల్ల సింగరేణి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. 2022–23లో రూ.2022 కోట్లు, 2023–24లో రూ.4712 కోట్లు, 2024–25 రూ.6,394 కోట్లు లాభాలు వస్తే ఈ సంవత్సరం డిక్లేర్ చేయలేదని హరీష్‌రావు విమర్శించారు. అందుతున్న సమాచారం ప్రకారం రూ.1800 కోట్లు కూడా మించదన్నారు. ఇంత దారుణంగా మూడు వంతుల లాభాలు తగ్గడం అంటే సింగరేణి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. దీనికి కారణం పరిపాలనా వైఫల్యం కాదా అని అడిగారు. రేవంత్ తుగ్లక్ నిర్ణయాల వల్ల లాభాలు పడిపోతున్న పరిస్థితి ఉందని, కార్మికులు మాత్రం అద్భుతంగా పని చేస్తున్నారని చెప్పారు. ఔట్ పుట్ ఫర్ మ్యాన్ షిప్ట్ చూస్తే గతంలో 6.39 టన్నులు ఉంటే ఈ ఏడాదికి 7.56కు పెరిగిందని, కార్మికులు కష్టం చేశారు కానీ అడ్డగోలు నిర్ణయాలు సింగరేణిని నష్టాల బాట పట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టడం, నెలలతరబడి టెండర్లు వాయిదా వేయడం, అధిక ధరలకు టెండర్లు కట్టబెట్టడం, రేవంత్ బామ్మర్దికి టెండర్లు ఇవ్వడం వల్ల ఇదంతా జరిగిందని ఆరోపించారు. 2023–24లో 70 మిలియన్ టన్నుల నుంచి 2025–26కు 58 మిలియన్ టన్నులకు బొగ్గు ఉత్పత్తి తగ్గిందని, నిజాయతీగా పని చేసే అధికారులను, మంచి డైరెక్టర్లను తొలగించి సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారని ఆరోపించారు.
మీ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి
సకాలంలో మైన్స్ ఓపెన్ చేయక, కాంట్రాక్టర్లకు పేమెంట్స్ ఇవ్వక నష్టాలకు వెళ్తున్నది.. మీ నిర్వాకం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని హరీష్‌రావువిమర్శించారు. రాష్ట్రంలో బొగ్గు లేక థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి ఆపేశారని, బొగ్గు లేక కరెంట్ ఉత్పత్తి చేయక రైతులు రోడ్లు మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారన్నారు. సింగరేణికి చెల్లింపులు రూ.50వేల కోట్లు దాకా ఆగిపోయాయని, ప్రభుత్వం నుంచి, జెన్కో నుంచి చెల్లింపులే లేవని అన్నారు. వాటా పంచకుండా రూ.6323 కోట్ల లాభాలను బ్యాంకుల్లో దాచి పెట్టారు.. మరి రూ.4వేల కోట్ల ఓడీ ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. జీతాలు ఇవ్వాలంటే ఎందుకు అప్పులు తేవాల్సిన పరిస్థితి వచ్చిందని నిలదీశారు. పదేండ్ల బిఆర్ఎస్ హయాంలో ప్రతి సంవత్సరంలో లాభాలు పెరిగాయి.. కరోనా వచ్చినా లాభాలు తగ్గలేదు.. కాంగ్రెస్ రాగానే ఉత్పత్తి, కార్మికుల వాటా ఎందుకు తగ్గింది, లాభాలు ఎందుకు తగ్గుతున్నాయి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
2019లో కేసీఆర్ జీవో ఇచ్చారు
జీవో 76 మేం తెచ్చినం అని అసెంబ్లీలో గొప్పలు చెప్పుకున్నరు.. ఇంటి హక్కులు కార్మికులకు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ 2019లో జీవో ఇచ్చారన్నారు. కానీ పొంగులేటి వైఎస్ హయాంలో జీవో ఇచ్చినం అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణి ప్రాంతంలో 30వేల మందికి ఇండ్లకు రిజిస్ట్రేషన్ చేసి అప్పగించారు.. కాంగ్రెస్ రాగానే జీవోను పక్కనబెట్టి నిషేధిత జాబితాలో పెట్టారని ఆరోపించారు. ఒక్క మంచిర్యాలలోనే వేల జాగలు నిషేధిత జాబితాలో పెట్టారన్నారు. మూడేళ్లు ఏం చేయకుండా బిగ్ రిలీఫ్, కార్మికులకు శుభవార్త అంటున్నరు.. మూడేళ్లు కార్మికుల ఉసురు పోసుకున్నందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే జీవో 76 కింద మిగిలిన కార్మికులకు సేల్ డీడ్ ద్వారా హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బిఆర్ఎస్ హయాంలో వలే కార్మికులకు ప్రతి నెలా మూడు మెడికల్ బోర్డులు పెట్టి డిపెండెంట్ ఉద్యాగాలు ఇవ్వాలని హరీష్‌రావు కోరారు. కేసీఆర్ 16వేల డిపెండెంట్ ఉద్యోగాలు . 4వేల మందికి పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చారు. మొత్తంగా 20వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. డిపెండెంట్ ఉద్యోగాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత నిషేధాన్ని పెట్టిందన్నారు .సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్రలు, చర్యలను మానుకోవాలని, బిఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. సింగరేణి కార్మికుల సమస్యల పట్ల బిఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి సిద్దం అవుతున్నది. కేంద్రం కూడా సింగరేణికి మైన్స్ కేటాయించాలని, సంస్థను కాపాడుకునేందుకు కేంద్ర బొగ్గు మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి చొరవ చూపాలని కోరుతున్నామన్నారు. కార్మికులు, సింగరేణి ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రామగుండం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





