హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: రైతు భరోసా నిధులు విడుదలయ్యాయంటూ కొన్ని జిల్లాల రైతులకు బుధవారం ఉదయం సందేశాలు వచ్చినట్లు వ్యవసాయ శాఖ దృష్టికి వచ్చిందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్), నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సంస్థలతో చర్చించిన తర్వాత ఈ సందేశాలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని నిర్ధారణ అయిందన్నారు. ఈ సందేశాల వెనుక ఉన్న వాస్తవికత నిర్ధారణ కోసం సైబర్ క్రైమ్ విభాగం పోలీసులకు సమాచారం అందించి పూర్తి విచారణ చేపట్టాలని కోరినట్లు ఆయన తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





