మానసిక ఒత్తిడి అనేది మన శారీరక, మానసిక మరియు భావోద్వేగ స్థితిని ప్రభావితం చేసే ఒక ప్రధాన అంశం. దీర్ఘకాలిక ఒత్తిడి స్త్రీల లైంగిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయగలదు. ఈ సమస్యలను అధిగమించేందుకు సరైన అవగాహన, జీవనశైలి మార్పులు, మరియు చికిత్స కీలకం.
మానసిక ఒత్తిడి వల్ల ఏర్పడే శారీరక మార్పులు
మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో కొన్ని హార్మోన్ల అసమ తుల్యత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఒత్తిడి హార్మోన్ లు పెరిగినప్పుడు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ మరియు టెస్టో స్టీరోన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది లైంగిక ఆసక్తిని తగ్గించడమే కాకుండా, రిప్రొడక్టివ్ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది.

మానసిక ఒత్తిడి వల్ల మహిళల్లో కనిపించే ముఖ్యమైన లైంగిక సమస్యలు
హైపోయాక్టివ్ సెక్స్యువల్ డిజైర్ డిజార్డర్: ఇది స్త్రీలలో అత్యంత సాధారణమైన లైంగిక సమస్య. దీని కారణంగా లైంగిక ఆకర్షణ పూర్తిగా తగ్గిపోతుంది. ఒత్తిడి, ఆందోళన, మరియు సంబంధాల్లో ఉద్రిక్తత దీని ప్రధాన కారణాలు.

అనారోగ్యకరమైన యోని మార్పులు: మానసిక ఒత్తిడితో యోని పొడిబారడం సంభవిస్తుంది. ఇది శరీర సంబంధ సమయంలో అసౌకర్యం, నొప్పి, మరియు చికాకు కలిగించవచ్చు.
లైంగిక స్పందనలో తక్కువతనం: ఒత్తిడి వల్ల రక్తప్రసరణ మందగించడం వల్ల జననాంగాల్లో స్పందన తగ్గుతుంది. దీని ప్రభావంగా శరీర సంబంధంలో ఆనందం తగ్గిపోతుంది.
ఆర్గాజమ్ పొందడంలో సమస్యలు: మానసిక ఒత్తిడి మెదడులోని ఆనందాన్ని నియంత్రించే కెమికల్స్ దోపమైన్, స్టెరాటోనిన్ స్థాయిని తగ్గిస్తుంది. ఈ మార్పులు శృంగార సమయంలో సంతృప్తి పొందడంలో ఆటంకంగా మారతాయి.

వాజినిజ్మస్: ఒత్తిడి, భయం, లేదా ట్రామా వల్ల యోని కండరాలు స్వచ్ఛందంగా గట్టిగా సంకోచించటం వల్ల శారీరక సంబంధ సమయంలో తీవ్రమైన నొప్పి సంభవిస్తుంది.
పీరియడ్లలో అవకతవకలు: ఒత్తిడి వల్ల మాసికధర్మంలో ఆలస్యం లేదా ముందుగానే రావడం జరుగుతుంది. కొన్నిసార్లు తీవ్ర ఒత్తిడితో మాసికధర్మం పూర్తిగా ఆగిపోవచ్చు.
సంతానోత్పత్తిలో ఆటంకం: మానసిక ఒత్తిడి వల్ల గర్భసంచి, కండరాల సంకోచం ఏర్పడి గర్భధారణ లో సమస్యలు వస్తాయి.
సహజంగా శృంగారంలో ఆసక్తి తగ్గిపోవడం: ఒత్తిడి వల్ల మెదడులోని ఊహాశక్తి తగ్గిపోవడం వల్ల శృంగారంపై ఆసక్తి తగ్గుతుంది.

ఒత్తిడిని తగ్గించడానికి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు
ధ్యానం మరియు యోగా : నిత్య జీవితంలో ధ్యానం మరియు ప్రాణాయామం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారం: విటమిన్ బి, మెగ్నీషియం, మరియు ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు లాంటి పోషకాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
నిజాయితీగా ఆలోచన చేసుకోవడం: ఒత్తిడికి మూలకారణాలను గుర్తించి వాటిని అధిగమించేందుకు చిత్తశుద్ధిగా ఆలోచించడం అవసరం.
ఆరోగ్యకరమైన జీవనశైలి: పోషకాహారం, నిద్ర, మరియు సమయపాలన వంటివి శారీరక ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తాయి.
శారీరక వ్యాయామం: నడక, జాగింగ్, లేదా ఏరోబిక్స్ వంటి శారీరక వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
కౌన్సిలింగ్ లేదా థెరపీ: ప్రత్యేకంగా సి.బి.టి. మరియు సెక్స్ థెరపీ ఒత్తిడిని తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయి.
భాగస్వామితో చర్చ: భాగస్వామితో స్వేచ్ఛగా తన భావాలను పంచుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
సమయ నిర్వహణ: ఒత్తిడిని తగ్గించేందుకు సమయాన్ని సమర్థవంతంగా నియంత్రించడం అవసరం.

ముఖ్యమైన సూచనలు
మానసిక ఒత్తిడిని గమనించి తొందరగా చర్యలు తీసుకోవడం అవసరం.
మహిళల్లో మానసిక ఒత్తిడి వల్ల ఏర్పడే లైంగిక సమస్యలు సాధారణమే కానీ లైంగిక సమస్యలను చిన్నగా భావించకుండా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సరైన జీవనశైలి మార్పులు, ధ్యానం మరియు మానసిక ఆరోగ్య సంరక్షణ ద్వారా ఒత్తిడి మరియు లైంగిక సమస్యలను అధిగమించవచ్చు.
జబ్బు తీవ్రతను బట్టి సైకో థెరపీ, మెడిటేషన్, లేదా మందుల ద్వారా చికిత్స పొందవచ్చు.

డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి,
సెక్స్ ఎడ్యుకేటర్ రిహాబిలిటేషన్, సైకాలజిస్ట్
ఫ్యామిలీ కౌన్సెలర్
సెల్: 9703935321