పేపర్ లీక్ లకు పాల్పడే వారికి కఠిన శిక్షలు

– బిల్లు పాస్ కావడంతో విద్యార్థులకు అమిత్ షా అభినందనలు

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 29: దేశంలోని లక్షలాది మంది పరీక్షార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026’కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ శుభా కాంక్షలు తెలిపారు. ఈ చట్టం ద్వారా పోటీ పరీక్షల్లో పారదర్శకత పెరుగుతుందని, పేపర్ లీకేజీలు, నకిలీ పరీక్షలు, ఇతర అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ఆయన పేర్కొన్నారు. నిజాయతీగా శ్రమించే విద్యార్థుల భవిష్యత్తును రక్షించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ… ‘పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్ర మాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవన్నారు. పేపర్ లీక్లలు, మోసపూరిత కార్యకలాపాలు, పరీక్షల గోప్యతను భంగం చేసే వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తాం. ఈ చట్టం అమల్లోకి రావడంతో పోటీ పరీక్షలపై విద్యార్థుల్లో విశ్వాసం మరింత పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటూ పరీక్షా వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వస నీయంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉంది’ అని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *