– 20 మంది మృతి, ఐదుగురు గల్లంతు
న్యూదిల్లీ,సెప్టెంబర్ 10: చైనాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కింగ్‌డావో బీహై షిప్‌యార్డ్‌లో మరమ్మతుల నిమిత్తం నిలిపి ఉంచిన ఒక కార్గో నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ విషాద ఘటనలో సుమారు 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. లైబీరియా జెండాతో ఉన్న ‘ఓషన్ మెలోడీ’ అనే కార్గో నౌకను మరమ్మతుల కోసం షిప్‌యార్డ్‌కు తీసుకువచ్చారు. పనులు జరుగుతున్న క్రమంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ప్రమాదం సంభవించిన సమయంలో నౌకలో మొత్తం 42 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, ప్రమాదానికి గల కారణాలపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నౌకలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ప్రధాని లీ కియాంగ్ స్పష్టం చేశారు. చైనా స్టేట్ షిప్‌బిల్డింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే కింగ్‌డావో బీహై షిప్‌యార్డ్, ఆ దేశంలోని అతిపెద్ద నౌకా నిర్మాణ, మరమ్మతు కేంద్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




