– విదేశీ ఒత్తిళ్లు లేవని ఆర్థిక శాఖ వెల్లడి!
– స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమన్న కేంద్ర ప్రభుత్వం
న్యూదిల్లీ, సెప్టెంబర్ 16 యూపీఐ లా వాదేవీలపై నేషనల్ పేమెంట్స్ కార్పొ రేషన్ ఆఫ్ ఇండియా మర్చంట్ డి స్కౌంట్ రేటును విధించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించిం ది. ఇందులో ఎలాంటి విదేశీ ఒత్తిళ్లు లేవ ని.. తాము స్వతంత్రంగా తీసుకున్న నిర్ణ యమని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఆర్థి కంగా నిలదొక్కుకోగలిగే.. అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను సృష్టించడమే ఈ కొత్త విధానం వెనుక ఉన్న లక్ష్యమని పేర్కొంది. స్వయం సమృద్ధి, సమ్మిళితమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అభివృద్ధి చేయడా నికే ఈ ఆలోచన చేసినట్లు తెలిపింది. రూ.2వేల్లోపు లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలూ వర్తించబోవని, ఆపైబడిన నిర్దిష్ట లావాదేవీలకు మాత్రం 0.4 శాతం ఛార్జీ లు చెల్లించాల్సి ఉంటుందని ఎన్పీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



