న్యూదిల్లీ, సెప్టెంబర్ 12 : చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ భారత్ కు చేరుకున్నారు. 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు శనివారం న్యూదిల్లీ కి వచ్చిన ఆయన.. దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్ లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. జిన్ పింగ్ తోపాటు చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు, పార్టీ కేంద్ర కార్యాలయ డైరెక్టర్ కై కీ, పొలిట్ బ్యూరో సభ్యుడు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ వచ్చారు. ఈ విషయాన్ని చైనాలో భారత రాయబారి షూ ఫెయిహోంగ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. 2020లో గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి కొనసాగడం ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి కీలకమని భారత్ పదేపదే స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో జిన్ పింగ్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల బిష్కెక్లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో మోదీ, జిన్ పింగ్ స్వల్పంగా మాట్లాడుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





