ఎంతోకాలం యుద్ధంతో తీవ్ర నష్టం

– ఇరాన్‌ ‌యుద్ధం నుంచి బయటపడడమే మేలు
– ట్రంప్‌నకు జనరల్‌ ‌డాన్‌ ‌కేన్ ‌సల‌హా !

వాషింగ్టన్‌, ఆగస్ట్ 8 :‌ ఐదు నెలలుగా ఇరాన్‌తో సాగిస్తోన్న యుద్ధం కారణంగా అమెరికా ఆయుధ నిల్వలు తరిగిపోతున్నాయని పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘర్షణలకు త్వరగా ముగింపు పలకాలని స్వదేశంలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అగ్రరాజ్య జాయింట్‌ ‌చీఫ్స్ ‌ఛైర్మన్‌ ‌జనరల్‌ ‌డాన్‌ ‌కేన్‌ ‌ట్రంప్ కార్య‌వ‌ర్గానికి కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధం నుంచి ఇకనైనా బయటపడాలని.. లేదంటే ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ఇరాన్‌తో యుద్ధం స్వల్పకాలికంగా ఉండాల్సింది. ఇప్పటికే అది ఆ దశను దాటేసింది. పశ్చిమాసియలో ఘర్షణలు తీవ్రతరం చేయడానికి మనకు అందుబాటులో ఉన్న సైనిక చర్యలు ప్రతికూల ఫలితాలు ఇచ్చే ప్రమాదం ఉంది. కేవలం వైమానిక శక్తితోనే నిర్దేశిత లక్ష్యాలను మనం సాధించలేం. అందుకే ఇకనైనా ఈ యుద్ధం నుంచి బయటకు వచ్చే మార్గాలను అన్వేషించాలని ట్రంప్‌ ‌సలహాదారులకు డాన్‌ ‌కేన్‌ ‌ప్రైవేటుగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయం గురించి ఆయన పలువురు కేబినెట్‌ అధికారులు, సీఐఏ డైరెక్టర్‌ ‌జాన్‌ ‌రాట్‌క్లిఫ్‌, ‌విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ‌తోనూ చర్చలు జరిపారట. ఇరాన్‌లో భూతల దాడులకు విముఖత చూపుతోన్న అధ్యక్షుడు ట్రంప్‌.. ‌దానికి బదులుగా వైమానిక దాడులను మరింతగా పెంచుతామని ఇటీవల కాలంలో పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ హెచ్చరికలతో ఇరాన్‌ను ఒప్పందానికి తీసుకురావొచ్చని ఆయన విశ్వసిస్తున్నారు. అయితే సుదీర్ఘకాలంగా వైమానిక దాడులు చే స్తుండ‌టంతో అగ్రరాజ్య ఆయుధ నిల్వలు భారీగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికే 80 శాతం మిసైల్‌ ‌డిఫెన్స్ ‌సిస్టమ్‌ ఇం‌టర్‌సెప్టర్లు, దాదాపు సగం పేట్రియాట్‌ ‌క్షిపణులు కరిగిపోయినట్లు ఇటీవల కథనాలు వచ్చాయి. వీటిని ట్రంప్‌ ‌కొట్టిపారేశారు. తమ వద్ద పెద్ద ఎత్తున ఆయుధ నిల్వలు ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేగాక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రక్షణ రంగ కంపెనీలు భారీ సంఖ్యలో ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నాయని తన ట్రూత్‌ ‌ఖాతాలో పోస్ట్ ‌చేశారు. అయితే క్షిపణుల సంఖ్య గురించి మాత్రం కచ్చితమైన లెక్క చెప్పలేదు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *