‘కిట్స్’ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక్‌రెడ్డి
ఘనంగా స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రాం
ఘనంగా స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రాం
వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : బి.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్(కిట్స్‌డబ్ల్యు)లో స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్(ఎస్‌ఓపి)ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి.నారాయణరెడ్డి, అడిషనల్ సెక్రటరీ వి.సతీష్ కుమార్, ఇతర మేనేజ్‌మెంట్ సభ్యులు మొదటి సంవత్సరం బీటెక్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ తమ అధ్యాపకులు విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించడానికి అంకితభావంతో ఉన్నారన్నారు. లీట్ కోడ్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి రోజూ కోడింగ్ సాధన చేయడం ద్వారా ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను సాధించవచ్చంటూ విజయం 80% సంభాషణా నైపుణ్యాలపై, 20% సాంకేతిక నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. 2030 నాటికి తమ విద్యార్థులను ఏఐ-రెడీ, క్వాంటం-రెడీ, ఫ్యూచర్-రెడీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. సామర్థ్యం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని విజయాన్ని సాధించాలని ఆయన ఉద్బోధించారు. మీ విద్యా ప్రయాణం విజయవంతంగా, సంతృప్తికరంగా సాగాలని ఆకాంక్షించారు. స్వీయ ప్రేరణ, పట్టుదల, విజయానికి కీలకం అని చెప్పారు. చైర్మన్ లక్ష్మీకాంత రావు మాట్లాడుతూ ఫలితాధారిత విద్య(ఓబీఈ) ద్వారా ప్రస్తుత శతాబ్దపు విద్యలో జ్ఞాన నాణ్యత, సామర్థ్యాలు, నైపుణ్యాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. సామర్థ్యాలు, నైపుణ్యాలను సాధించేందుకు తమ కళాశాల ఫలితాధారిత పాఠ్యప్రణాళికను ప్రవేశపెట్టిందన్నారు. మీరు సంపాదించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి మీ నైపుణ్యాలను పటిష్టం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బి.టెక్ మొదటి సంవత్సరం స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్(ఎస్‌ఐపి) సోమవారం నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. కోశాధికారి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులు 2030లో తమ కోర్సును పూర్తి చేస్తారని, ఈ బ్యాచ్ కళాశాల స్వర్ణోత్సవ సంవత్సరానికి ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పారు. కావున విద్యార్థులు స్వయం ప్రేరణతో, అంకితభావంతో, అత్యంత గౌరవప్రదమైన రీతిలో అభ్యాసన కొనసాగిస్తూ తమ ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవాలన్నారు. అదనపు కార్యదర్శి సతీష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి సమాజం చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తీవ్రతను మించి నిలకడ గొప్పదని, నిలకడైన చర్యలతోనే విజయం సాధ్యమని చెప్పారు. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (ఎస్‌ఏసీ) ద్వారా పాఠ్యేతర కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. తాము ప్రాథమిక డిగ్రీతోపాటు అదనపు లెర్నింగ్ ఆనర్స్/మైనర్‌గా డ్యూయల్ డిగ్రీ ఆప్షన్‌లను కూడా ప్రవేశపెట్టామన్నారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఈ.వెంకట్రామ్ రెడ్డి, ఆకారపు హరీష్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్. పి.రమేష్ రెడ్డి, వివిధ విభాగాల డీన్‌లు ప్రొఫెసర్ సూర నరసింహారెడ్డి, ప్రొఫెసర్. ఎల్.సుధీర్ రెడ్డి(డీన్ పీ అండ్ ఈ), విభాగాల అధిపతులు ప్రొఫెసర్ శ్రీకాంత్ పబ్బ(ఎంఈడీ), ప్రొఫెసర్ వి.రఘురామ్ (ఈసీవీ), డాక్టర్ డి.హరికృష్ణ(సివిల్), ప్రొఫెసర్ నిరంజన్(సీఎస్‌ఈ), ప్రొఫెసర్ జ్యోతిప్రభ(సీఎస్‌ఈ-ఏఐ అండ్ ఎంఎల్), ప్రొఫెసర్ వెంకట్రాములు(సీఎస్‌ఎన్), డాక్టర్ ఎం.నరసింహారావు, అకడమిక్ వ్యవహారాల ఫ్యాకల్టీ ఇన్‌చార్జిలు డాక్టర్ పి.నాగార్జున రెడ్డి, డాక్టర్ ఆర్.శ్రీకాంత్, డాక్టర్ ఆర్.రమేష్, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు డాక్టర్ హెచ్.రమేష్‌బాబు, డాక్టర్ కె.శివశంకర్, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ పిఆర్ఓ డాక్టర్ డి.ప్రభాకరాచారి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సుమారు 3000మంది రెండు సెషన్లలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
———————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





