ట్రంప్ దూకుడుకు సెనెట్ కళ్లెం

– యుద్ద అధికారాలను పరిమితం చేస్తూ తీర్మానం

వాషింగ్టన్, మే 20 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై ఆయన దూకుడు ప్రవర్తనకు అమెరికా సెనెట్ క్లళెం వేసింది. అధ్యక్షుడి యుద్ధ అధికారాలను పరిమితం చేసే తీర్మానానికి తాజాగా ఆమోదం లభించింది. ఫిబ్రవరి చివరిలో ఇజ్రాయెల్‌తో కలిసి ట్రంప్ ఇరాన్‌పై యుద్దానికి దిగారు. యుద్ధంపై ట్రంప్ అధికారాలను పరిమితం చేసేందుకు డెమోక్రాట్లు అనేకసార్లు సెనెట్‌లో ఓటింగ్ నిర్వహించారు. అయితే వారి తీర్మానాలకు తగినంత ఓటింగ్ లభించలేదు. డెమోక్రటిక్ సెనెటర్ టిమ్ కెయిన్ తాజాగా మరోసారి సెనెట్ ముందుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. యుద్ధ ప్రకటన, సైనిక చర్యకు కాంగ్రెస్ నుంచి స్పష్టమైన ఆమోదం లభిస్తే తప్ప ఇరాన్ లోపల లేదా దానికి వ్యతిరేకంగా జరిగే ఘర్షణల్లో యÖఎస్ దళాలు పాల్గొనకూడదని అందులో తెలిపారు. దీనికి 50మంది అనుకూలంగా, 47మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఈ తీర్మానానికి అనుకూలంగా నలుగురు రిపబ్లికన్ సభ్యులు కూడా ఓటు వేయడం గమనార్హం. కాగా, ఈ బిల్లు ఆమోదానికి సంబంధించి త్వరలో తుది ఓటింగ్ జరగనుంది. ఇది చట్టంగా మారితే కాంగ్రెస్ అధికారికంగా సైనిక దాడి కొనసాగించడానికి అనుమతి ఇచ్చేవరకు ట్రంప్ ఇరాన్‌పై ఎలాంటి దాడులకు దిగకూడదు. ఓటింగ్ సందర్భంగా డెమోక్రటిక్ సెనెట్ చక్ షుమర్ మాట్లాడుతూ యుద్దానికి సంబంధించిన నిర్ణయాలపై కాంగ్రెస్ తిరిగి పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ‘ఈ అధ్యక్షుడు నిండుగా తూటాలున్న తుపాకీతో ఆడుకుంటున్న చిన్న పిల్లాడిలా ఉన్నాడు’ అని వ్యాఖ్యానించారు. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు కొనసాగుతోన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *