– పుతిన్, జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశం
న్యూదిల్లీ, మే 20: న్యూదిల్లీ వేదికగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనున్నది. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశాలకు పుతిన్ హాజరవుతారని దక్షిణాఫ్రికాలోని రష్యా ఎంబసీ ధ్రువీకరించినట్టు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. జిన్‌పింగ్ కూడా ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే, చైనా అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. జిన్‌పింగ్ భారత పర్యటనపై ఇప్పటికే అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. 2019లో ఆయన భారత్‌లో పర్యటించారు. ఆ తరువాత 2020లో గాల్వాన్ లోయలో ఇరు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణలు, 2022లో తవాంగ్ బోర్డర్ వద్ద ఉద్రికత్తల కారణంగా కొంతకాలంపాటు పరిస్థితులు గంభీరంగా మారాయి. ఆ తరువాత రష్యాలో కజాన్ వేదికగా జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ, జిన్‌పింగ్‌లు సమావేశమయ్యారు. భౌగోళిక రాజకీయాలు, ఇరాన్ యుద్ధం విషయంలో బ్రిక్స్ కూటమిలో భేదాభిప్రాయాలు నెలకొన్నాయన్న వార్తల నడుమ తాజా సమవేశాలకు రష్యా, చైనా అధినేతలు హాజరుకానున్నారు. ఇటీవల జరిగిన బ్రిక్స్ విదేశాంగ శాఖ మంత్రులు, ప్రతినిధుల సమావేశంలో భేదాభిప్రాయాల కారణంగా దేశాల సంయుక్త ప్రకటన ఏదీ వెలువడలేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





