మెటాలో భారీగా ఉద్యోగుల తొలగింపు

– వర్క్‌ఫ్రమ్ హోమ్ అంటూనే సడన్‌గా లేఆఫ్స్

న్యూదిల్లీ, మే 20: ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాలో ఉద్యోగ తొలగింపులు ప్రారంభమయ్యాయి. సంస్థ తొలుత తమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ చేయాలని చెప్పి ఆక‌స్మికంగా లేఆఫ్ మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సింగపూర్, యూఎస్, యూకే వంటి ప్రాంతాల్లోని ఉద్యోగులకు తొలుత ఇంటినుంచే పనిచేయాలని కంపెనీ తెలిపింది. అందుకు వారు సిద్ధమవుతుండగా తెల్లవారుజామున ఆ ఉద్యోగులకు లేఆఫ్ మెయిల్స్ పంపింది. ఎలాంటి గందరగోళం జరగకుండా ఉండేందుకు సంస్థ ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ చర్యపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక మెటా తన సింగపూర్‌లోని టీమ్‌కు తొలుత ఈ మెయిల్స్ పంపింది. ఉదయం 4 గంటలకు భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:30 గంటలకు వారికి అవి అందాయి. ఈ తొలగింపులకు ముందు ప్రపంచవ్యాప్తంగా మెటాలో దాదాపు 78 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. తాజాగా 10 శాతం అంటే దాదాపు ఎనిమిది వేల మందిని ఉద్యోగం నుంచి తొలగించనుంది. ఇందులో ఎక్కువగా ఇంజినీరింగ్, ప్రోడక్ట్ బృందాలు ప్రభావం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరల్లో కంపెనీ మరికొన్ని తొలగింపులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వేల మందిని ఏఐ విధుల్లోకి మార్చనున్నట్లు మెటా హెచ్‌ఆర్ చీఫ్ జానెలలె గేల్ ఇప్పటికే తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *