మహారాష్ట్ర సీఎస్‌తో సంజయ్ జాజు భేటీ

రెండు రాష్ట్రాల మధ్య బంధాన్ని బలోపేతం చేసుకోవాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ అగర్వాల్‌ను ముంబైలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి ప్రగతి, ‘రైజింగ్ తెలంగాణ-2047’ విజన్ తదితర అంశాలను సంజయ్ వివరించారు. తెలంగాణ-మహారాష్ట్రల మధ్య ఉన్న సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం, పరస్పర సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలపై ఇద్దరూ చర్చించారు. అనంతరం సంజయ్ జాజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎండీ సిఎస్.శెట్టిని కూడా ముంబైలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ‘రైజింగ్ తెలంగాణ-2047’ లక్ష్యాలు తదితర అంశాలను ఆయనకు వివరించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సంజయ్ జాజు వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *