అద్దెకు ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్సులు

– 694 షాపులకు టెండర్లు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే కాక సంస్థ పరిధిలోని వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న ఆర్టీసీ వ్యాపార సముదా యాలను (కమర్షియల్ కాంప్లెక్సులు) అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు సంస్థ సిద్ధమైంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి, తమ సంస్థలను విస్తరించుకోవాలనుకునే వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ గా భావిస్తున్నారు. సాధారణంగా ఏ వ్యాపారానికైనా కస్టమర్ల రాక అనేది అత్యంత కీలకం. ఆర్టీసీ బస్టాండ్లు, కాంప్లెక్స్ లు నిరంతరం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. రోజూ లక్షలాదిమంది రాకపోకలు సాగించే ఈ ప్రాంతాల్లో వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవ డం వల్ల ఎలాంటి ప్రచార ఖర్చులు లేకుండానే వ్యాపారస్తులకు కస్టమర్లు లభిస్తారు. హోటళ్లు, ఫుడ్ కోర్టులు, సూపర్ మార్కెట్లు, బ్రాండెడ్ షోరూమ్ ల నుండి చిన్న తరహా దుకాణాల వరకు అన్ని రకాల వ్యాపారాలకు ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ లు అనువైన వేదికలుగా మారనున్నాయి.

694 షాపులకు త్వరలోనే టెండ‌ర్లు

ఆర్టీసీ 694 షాపులకు త్వరలోనే టెండ‌ర్లు పిలిచేందుకు సిద్ధ‌మైంది. ఆర్టీసీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ దళారీ వ్యవస్థకు పూర్తిగా చెక్ పెట్టేలా సంస్థ పరిధిలోని అన్ని వ్యాపార సముదాయాల వివరాలను యాజమాన్యం అధికారిక వెబ్‌సైట్‌ tgsrtc.telangana.gov.in లో బ‌హిరంగపరిచింది. ఏయే ప్రాంతాల్లో ఎన్ని వ్యాపార సముదాయాలు ఉన్నాయి, అవి ఖాళీగా ఉన్నాయా, ప్రస్తుతం ఆ షాప్ లను ఎవరు నిర్వహిస్తున్నారు, వారి లీజు కాలపరిమితి, అద్దె ఎంత అనే పూర్తి సమాచారాన్ని ఆన్లైన్ లో అందుబాటులో ఉంచారు. అద్దెదారుల ఎంపికలో డిజిటల్ జవాబుదారీతనాన్ని పెంచేందుకు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *