విద్యార్థిపై దాడి చేసిన ఆర్టీసీ డ్రైవర్ తొలగింపు

మహబూబాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు సమీపంలో పాఠశాల విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, దాడికి పాల్పడిన తొర్రూరు డిపోకు చెందిన బస్సు డ్రైవర్ స్వామిని విధుల నుంచి తొలగిస్తూ టీజీఎస్ ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణలో డ్రైవర్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినట్లు తేలడంతో తక్షణమే ఈ చర్యలు తీసుకున్నారు. ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందికి సంస్థ స్పష్టం చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *