న్యూదిల్లీ, సెప్టెంబర్ 19 : తనను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారని, అలాగే 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బీ- ఫారం అందుకుని సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారనే ప్రాతిపదికన ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గతంలో స్పీకర్ ఈ పిటిషన్లను కొట్టివేయగా, దాన్ని హైకోర్టు తప్పుపట్టింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రకారం 2024 ఏప్రిల్ 23 (నామినేషన్ దాఖలు చేసిన తేదీ) నుంచే నాగేందర్ అనర్హుడని పేర్కొంటూ సీజే నేతృత్వంలోని బెంచ్ సంచలన శుక్రవారం తీర్పునిచ్చింది. దీంతో నాగేందర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో శనివారం అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల అమలుపై స్టే ఇవ్వాలని, ఖైరతాబాద్ స్థానాన్ని ఖాళీగా ప్రకటించడాన్ని నిలిపివేయాలని పిటిషన్ లో కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





