గన్ మిస్ ఫైర్.. ఆర్ఐ సతీష్ మృతి


నిజామాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: నిజామాబాద్: పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎన్ఎస్ఓ డ్యూటీ ముగించుకుని వచ్చిన అనంతరం ఉదయం సమయంలో తన ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ కావడంతో రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ మృతిచెందారు. సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితని పర్యవేక్షించారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. ఆయుధాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ జరిగినట్లు ప్రాథమికంగా సమాచారం. అయితే ఘటనకు దారితీసిన పూర్తి కారణాలు, ఇతర వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *