నూతన శకంలోకి లైఫ్ సైన్సెస్

– పరిశోధనలు, ఆవిష్కరణల దిశగా అడుగులు
– 2,000కు పైగా కంపెనీలతో ఎకోసిస్టమ్
– వ్యాక్సిన్ల తయారీలో గ్లోబల్ లీడర్‌గా హైదరాబాద్
– ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల కీలక వ్యాఖ్యలు
– లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల్లో నూతనాధ్యాయం
– ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం

హైదారాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10: హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగం పరిశోధనలు, ఆవిష్కరణల దిశగా నూతన శకంలోకి అడుగుపెట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణలో 2,000కు పైగా కంపెనీలతో సంపూర్ణమైన లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ ఉందని, వ్యాక్సిన్ల తయారీలో హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ లీడర్‌గా ఎదిగిందని తెలిపారు. అంతేకాక అమెరికా వెలుపల అత్యధిక ఎసఎఫ్‌డీఏ ఆమోదం పొందిన సంస్థలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్ ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌డీ డిజిటల్ హ్యూమన్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ నారాయణ్ సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రితేష్ శ్రీవాస్తవ, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, లైఫ్ సైన్సెస్ సీఈవో సర్వేశ్ సింగ్‌తో Íటు సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రం కేవలం ఔషధ తయారీకే పరిమితం కాకుండా అధునాతన ఆర్ అండ్ డీ, గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాల దిశగా దూసుకుపోతోందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. గత రెండేళ్ల కాలంలో ఆమ్‌జెన్, ఎలీ లిల్లీ, బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్, సనోఫీ, అలైన్ టెక్నాలజీ, జోయెటిస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘నెక్ట్స్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30 ద్వారా డ్రగ్ డిస్కవరీ నుంచి మాన్యుఫ్యాక్చరింగ్, క్లినికల్ రీసెర్చ్, అత్యాధునిక టెక్నాలజీల అనుసంధానానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. గత ఏడాది ఏర్పాటైన 75కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు తోడు త్వరలోనే జీసీసీల సంఖ్యను వందకు చేరుస్తామని, దీనిద్వారా దాదాపు నాలుగు లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించారు. అంతేకాక భారత్ ఫ్యూచర్ సిటీలో 2,100 ఎకరాల లైఫ్ సైన్సెస్ జోన్, ప్రత్యేకంగా వంద ఎకరాల్లో బయోలాజిక్స్ హబ్‌తోపాటు బయో మోడల్ మౌలిక వసతులను కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఎంఎస్‌డీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి డిజిటల్ సామర్థ్యాలను విస్తరించేందుకు హైదరాబాద్‌లో విస్తారమైన ప్రతిభ, అత్యుత్తమ టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఉన్నాయని, అందుకే ఈ నగరాన్ని ఎంచుకున్నామని తెలిపారు. ఈ నూతన కేంద్రం ద్వారా డిజిటల్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంజినీరింగ్ సాంకేతికతలతో ప్రపంచవ్యాప్తంగా మానవ, జంతు ఆరోగ్య రక్షణకు అవసరమైన పరిష్కారాలను అందిస్తామని సంస్థ స్పష్టం చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *