అర్చకులు, గిరిజన అర్చకుల పాత్ర అభినందనీయం

వారి సంక్షేమానికి సంప్రదింపుల కమిటీ పూర్తి భరోసా
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో ఆలయాల వేదికగా మంత్రోచ్ఛారణలు, ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా సకల జనులలో స్వరాష్ట్ర కాంక్షను రగిలించడంలో అర్చకులు, గిరిజన అర్చకులు నిర్వహించిన పాత్ర అభినందనీయమని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కొనియాడింది. రాష్ట్రవ్యాప్తంగా మలి దశ ఉద్యమంలో ఆధ్యాత్మిక రంగాన్ని ఏకం చేసి పోరాడిన అర్చకులు, గిరిజన అర్చకుల ప్రతినిధులతో కమిటీ బుధవారం ప్రత్యేక ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో కమిటీ సభ్యులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, మోతె శోభన్ రెడ్డి, ఎస్.రాములు నాయక్ పాల్గొని అర్చక స్వాములు సమర్పించిన వినతి పత్రాలను స్వీకరించారు.

అర్చకులు, గిరిజన అర్చకుల ప్రధాన డిమాండ్లు

అర్చక సమాఖ్య నాయకులు తమ సంక్షేమానికి సంబంధించి పలు ప్రధాన అంశాలను కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల నిర్వహణను మరింత బలోపేతం చేసేందుకు ధూపదీప నైవేద్యం కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని తక్షణమే పెంచాలని విజ్ఞప్తి చేశారు. అర్చకుల, గిరిజన అర్చకుల పిల్లలకు వేద విద్యతో పాటు నాణ్యమైన సాధారణ విద్యను పూర్తిగా ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుపేద గిరిజన అర్చకులకు, అర్చక కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చేలా 250 గజాల నివాస భూమిని కేటాయించి ఉచిత రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. అర్చక కుటుంబాల అత్యవసర వైద్య అవసరాల నిమిత్తం అపరిమిత ఉచిత వైద్యం అందేలా ప్రత్యేక డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేయాలని కూడా కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *