భద్రాద్రి వద్ద పెరుగుతున్న వరద

– నిండుకుండలా తాలిపేరు ప్రాజెక్ట్
– పది గేట్లు ఎత్తి 55. 437 క్యూసెక్కుల నీరు విడుదల

భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: అల్ప పీడన కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్గాలకు భద్రాచలం. వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. శుక్రవారం మధ్యాహ్నానికి 18. 2 అడుగుల ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 20, 1 అడుగుకు చేరుకుంది. ఎగువ ప్రాంతాలలో ఉన్న ప్రాజెక్టులు నుండి నీరు విడుదల చేయడంతో ఇది క్రమంగా పెరుగుతూ శనివారం ఉదయం నుంచి మరింత పెరిగి 25 అడుగుల నుండి 30 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చర్ల మండలంలో ఉన్న తాళపేరు ప్రాజెక్ట్ నిండు కుండలా మారడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా పదిహేను ఎత్తివేశారు. 55. 437 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. అలాగే చత్తీస్ గఢ్, ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుకుంటున్నది. దీని కారణంగా భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతున్నది. మేడిగడ్డ ప్రాజెక్టు నుండి 85 గేట్లు ఎత్తివేసి 41, 520 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు వరద నీరు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో కింది భాగానికి నీటిని విడుదల చేస్తున్నారు. దీని కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతున్నది.

అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్

భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమ క్రమంగా పెరుగుతున్న దృశ్య అధికారులను జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రమాద పరిస్థితిని ముందుగానే గమనించాలని అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే భారీ వర్షాల కారణంగా ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్ల వద్దని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *