సీఈసీపై క్రిమినల్ దర్యాప్తు చేపట్టండి

– సుప్రీంకోర్టులో పిల్ దాఖలు
– వోటర్ల జాబితా సవరణలో ఏకపక్ష నిర్ణయాలు,
– అక్రమ డిలీట్లపై అడ్వకేట్ శైలేంద్ర మణి త్రిపాఠి పిటిషన్

న్యూదిల్లీ, సెప్టెంబర్ 25: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఫై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. సీఈసీ జ్ఞానేశ్ ఫై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని అందులో డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అక్రమ రీతిలో వోట్లను డిలీట్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. సీఈసీ జానేశ్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ తన బాధ్యతలను
ఉల్లంఘించినట్లు అడ్వకేట్ శైలేంద్ర మణి త్రిపాఠి ఆరోపించారు.   రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఆయన ఆ పిల్ దాఖలు చేశారు. వోటర్ల రివిజన్ ప్రక్రియ కోసం అనేక నిర్ణయాలను తమ ఆమోదం లేకుండానే తీసుకున్నట్లు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఆరోపించిన విషయం తెలిసిందే. సీఈసీ తీసుకున్న నిర్ణయాలు, మార్గదర్శకాలు, సూచనలు, సాఫ్ట్ వేర్‌ మార్పులను తక్షణమే రద్దు చేయాలని కోరారు. ‘సర్’ ప్రక్రియతో సంబంధం ఉన్న అంశాల్లో 14 సార్లు సీఈసీ జ్ఞానేశ్ను వ్యతిరేకించినట్లు ఎన్నికల కమిషనర్లు సుఖీబీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి ఆరోపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *