– 14 మందికి గాయాలు.. ఆలస్యంగా వెలుగులోకి
– హాస్టల్ కు చేరుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి
-లోపలికి వెళ్ళకుండా అడ్డుకున్న పోలీసులు, సిబ్బంది
– హాస్టల్ ఎదుట ధర్నాకు దిగిన దయాకర్ రావు
పాలకుర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి నిద్రిస్తున్న విద్యార్థినులను ఎలుకలు కరవడంతో పలువురికి గాయాలయ్యాయి. బాధితులను ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించినట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శుక్రవారం గురుకుల పాఠశాల, హాస్టల్ కు చేరుకున్నారు. విద్యార్థినులను పరామర్శించి ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు, పాఠశాల సిబ్బంది అను మతించలేదని ఆయన తెలిపాయ. విద్యార్థినుల పరిస్థితి గురించి తెలుసుకునే వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదంటూ హాస్టల్ ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం వార్డెన్, ప్రిన్సిపాల్ తో మాట్లాడిన ఎర్రబెల్లి విద్యార్థినులకు కనీస వసతులు కల్పించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయ ని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయని, గతంలో ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని పాము కరిచిందని ఆయన పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత, కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్ల క్ష్యం చేస్తోందని ఆరోపించారు. 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటనపై ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకర మన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల సెక్రటరీ శారదతో ఫోన్లో మాట్లాడి ఘటన వివరా లను ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు ఎర్రబెల్లి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చినట్లు చెప్పారు. కనీస వసతుల కల్పన పై ప్రభుత్వం దృష్టి సారించాలని, విద్యార్థి నుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. గతంలో తాను మంత్రిగా ఉన్నపుడు విద్యార్థుల సౌకర్యాల పై పర్యవేక్షించామని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు..
బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా
ఎలుకల దాడిలో విద్యార్థినులు గాయపడడంతో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో పాఠశాల గేటు ముందు ధర్నా నిర్వహించారు. విద్యార్థినీలకు మెరుగైన వైద్య సేవలు అందించలన్నారు. పాఠశాలలో పరిశుభ్ర
తను పాటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు పాకనాటి దేవేందర్ రెడ్డి, దొంగరి మ హేం దర్, మండల అధ్యక్షులు మారం రవికు మార్, ప్రధాన కార్యదర్శులు వేల్పుల దేవరా జు, పెనుగొండ సోమేశ్వర్, నాయకులు ఈర్ల రాజు, కరుణాకర్ పాల్గొన్నారు.
తహసిల్దార్, ఎంపీడీవోలకు బీఆర్ఎస్ వినతి పత్రం
పాఠశాలలో జరిగిన సంఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి అనంతుల ఆంజనేయులు ఆధ్వర్యంలో తహసిల్దార్, ఎంపీడీవోలకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ గురుకుల పాఠశాలల నిర్వహణలో గత పాలకుల తరహాలోనే నేటి పాలకులు అవలంబిస్తున్నారని విమర్శించారు. బాలికలకు మెరుగైన వైద్య సేవలు అందించి వారి తల్లిదండ్రులకు చూపాలని డిమాం డ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు మూల ప్రభాకర్ గౌడ్, పొన్నం యాకయ్య గౌడ్, నాయకులు అంబోజు సంతోష్, అనిత, పూలమ్మ, కొమురయ్య, సోమ నరసయ్య పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో..
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థినీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎడవల్లి సోమచ్ అండ్, రాష్ట్ర నాయకులు చెరిపెల్లి యాదగిరి స్వామి, నాయకులు దండు రామచంద్రు. జలగం నరేష్, గడ్డం బాబు. అనిల్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





