గ్రూపు-3 సర్వీస్‌ ‌పోస్టుల ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్‌3 ‌సర్వీసు పోస్టుల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ ఛైర్మన్‌ ‌బుర్ర వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలను చెక్‌ ‌చేసుకోవచ్చు. మొత్తం 1365 గ్రూప్‌ 3 ‌పోస్టుల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 1401 పరీక్ష కేంద్రాల్లో గతేడాది నవంబర్‌ 17, 18 ‌తేదీల్లో రాత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

రాష్ట్ర వ్యాప్తంగా 5,36,400 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,69,483 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. అంటే సగం మంది (50.24శాతం మంది) మాత్రమే గ్రూప్‌ 3 ‌పరీక్షలకు హాజరయ్యారన్నమాట. మొత్తం 3 పేపర్లకు ఈ పరీక్షలు జరిగాయి.

కాగా ఇప్పటికే షెడ్యూలు ప్రకారం మార్చి 10, 11 తేదీల్లో గ్రూప్‌-1, ‌గ్రూప్‌-2 ‌రాతపరీక్షల మార్కులను వెల్లడించిన కమిషన్‌.. ‌మార్చి 14న గ్రూప్‌ 3 ‌జనరల్‌ ‌ర్యాంకు జాబితాను కూడా వెల్లడించింది. ఆయా పోస్టులకు సంబంధించిన మార్కులతో కూడిన జనరల్‌ ‌ర్యాంకింగ్‌ ‌జాబితాలో అభ్యర్ధులు తమ మార్కులను చెక్‌ ‌చేసుకోవచ్చు. 563 గ్రూప్‌ 1 ‌సర్వీసు పోస్టులకు, 783 గ్రూప్‌ 2 ‌సర్వీసు పోస్టులకు నియామక ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఇవి రెండూ పూర్తైన తర్వాత గ్రూప్‌ 3 ‌పోస్టులకు తుది జాబితా వెల్లడిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *