రిమాండ్ ఖైదీ మృతి

– మృతుడు భార్య, కుమారుడిని హత్య చేసిన రాందాస్
– విచారణ జరిపించాలి : కుటుంబ సభ్యుల డిమాండ్

అమనగల్లు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : అమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాం నగర్ తండా గ్రామ పంచాయతీ పులిగోనిపల్లి తండాలో మార్చి 31న తాగిన మత్తులో భార్యపై అనుమానంతో భర్త బాణావత్ రాందాస్ భార్య కవిత, కుమారుడు. హర్షిత్ ను రోకలి కర్రతో బలంగా కొట్టడంతో ఇద్దరు మృతి చెందాడు. కూతురు ప్రణీత పై కూడా రోకలి కర్రతో దాడి చేయడంతో ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన పోలీసులు కేసును ఛేదించి భార్య కుమారుడిని హత్య చేసిన నిందితుడు రాందాస్ ని ఏప్రిల్ 1న కోర్టు లో హాజరుపరచగా అతనిని వ్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతడిని చంచల్ గూడా జైలుకు తరలించారు. చంచల్ గూడ జైలులో ఏప్రిల్ 4న రెండవ అంతస్తులో ఉన్న బ్యారక్ నుంచి మెట్ల ద్వారా కిందికి దిగుతున్న రాందాన్ కింద పడిపోయి తీవ్ర గాయాలైనట్టు జైలు అధికారులు తెలిపినట్లు అతని సోదరుడు బాణావత్ విజేందర్ తెలిపాడు. వెంటనే అతనిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిగా అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 13న రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది.. భార్య కుమారుడు మృతి చెందిన పది రోజుల్లోనే నిందితుడు. తండ్రి మృతి రెండడం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాందాస్ భార్య పల్లలను చంపలేదని అతని వెంబడి మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి చంపినట్లు వికేందర్ ఆరోపిస్తున్నారు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాందాస్ మృతి చెందడం పట్ల విచారణ జరిపి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు… రిమాండ్ ఖైదీ మృతిపై విచారణ జరిపించాలి. హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాందాస్ మృతిపై తమకు పలు అనుమానాలు ఉన్నాయని విచారణ జరిపి న్యాయం చేయాలని మృతుడి సోదరుడు బాణావత్ విజేందర్ కోరాడు. జైలులో కింద పడగా ఆసుపత్రికి తీసుకెళ్తున్న దృశ్యాలే సీసీ కెమెరాలో రికార్డు అయి ఉన్నాయని పైనుంచి కింద పడే వీడియో కనిపించడం లేదని వారు. ఆరోపించారు. వెంటనే రిమాండ్ ఖైరీ దృతి పై విచారణ జరిపి తమ కుటుంబానికి…. అనాధలైన మృతుడు రిమాండ్ ఖైదీ రాందాస్ కూతుర్లకు న్యాయం చేయాలని విజేందర్ ప్రభుత్వాన్ని అధికారులను కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *