కశ్మీర్‌లోకి 10వేల మంది ఉగ్రవాదుల తరలింపు

– నసీర్ మాద్నీ సంచలన వ్యాఖ్యలు

లాహోర్, ఆగస్ట్ 19 : పాక్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ మత బోధకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్‌నగర్‌లో ఈనెల 14న జరిగిన సమావేశంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన నసీర్ మాద్నీ అనే ఆ బోధకుడు కశ్మీర్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉగ్ర సంస్థ ల‌ష్క‌ర్‌-ఎ-తొయిబా(ఎల్‌ఈటీ) చీఫ్ హఫీజ్ సయీద్ కశ్మీర్‌లోకి పదివేల మంది ఉగ్రవాదులను పంపించినట్టు చెప్పాడు. దీంతో, కశ్మీర్‌లో ఉగ్ర నెట్‌వర్క్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం అవుతోంది. హఫీజ్ సయీద్ సారథ్యంలోని ఎల్‌ఈటీ భారత్‌లో అనేక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి అత‌డిపై పలు కేసులు నమోదయ్యాయి. 26/11 దాడుల్లో పాల్గొన్న పాక్ ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబైలోకి ప్రవేశించి నాలుగు రోజులపాటు మారణ హోమం సృష్టించారు. ఈ ఉగ్రవాద దాడిలో 166మంది మరణించగా 300మంది గాయపడ్డారు. ఇక గతేడాది పహల్గాం దాడిలో 26మంది సాధారణ పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి జమ్ములోని కోర్టు హఫీజ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఐక్యరాజ్య సమితి, అమెరికా కూడా ఎల్‌ఈటీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *