– ఇరాన్‌తో వాణిజ్య బంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటన
న్యూఢిల్లీ, ఆగస్టు 19 : ఇరాన్‌తో అన్ని వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను ఈనెల 19నుంచి నిలిపివేసినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రకటించింది. ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో యూఏఈ ఈ చర్య తీసుకుంది. ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా ఇరాన్‌తో అన్ని వాణిజ్య, వ్యాపార వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేశామని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమెలీ తెలిపారు. మరో క్షిపణి ముప్పు గురించి దేశ ప్రజల్ని హెచ్చరిస్తూ ఫోన్ అలర్ట్ జారీ చేసిన దాదాపు రెండు గంటల తర్వాత యూఏఈ ఈ ప్రకటన చేసింది. ‘ప్రస్తుత పరిస్థితి క్షిపణి ముప్పు కారణంగా ప్రజలు వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆ ఫోన్ అలర్ట్‌లో పేర్కొంది. అయితే, ఆ అలర్ట్‌ను కొద్దిసేపటికే ఉపసంహరించారు. ఫిబ్రవరి 28న పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ దాడుల తీవ్రతను యూఏఈ ఎక్కువగా ఎదుర్కొంది. ఈ ప్రాంతంలోని ఇతర దేశం కంటే ఎక్కువగా దాదాపు 3,000 క్షిపణులు, డ్రోన్‌లు ఆ దేశంపై ఇరాన్ ప్రయోగించింది. గల్ఫ్‌లోని నౌకా రవాణాపై ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని యూఏఈ ఆరోపించగా ఈ ఆరోపణను ఇరాన్ ఖండించింది. ఇరాన్ తమ దేశం వైపు క్షిపణిని ప్రయోగించిందన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాదనను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ ఖండించారు. ఈ వాదన ప్రాంతీయ విశ్వాసానికి, భద్రతా ప్రయత్నాలకు హానికరమని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





