భారీ డేటా చార్జీల నుంచి ఉపశమనం

– తక్కువ ధరలో ప్లాన్స్ తీసుకురావాలన్న ట్రాయ్

న్యూదిల్లీ, సెప్టెంబర్ 22 : బేసిక్ ఫీచర్ ఫోన్లు వాడేవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్స్యూస్ చెప్పింది. ఈ ఫోన్లు వాడేవారికి ఇక నుంచి తక్కువ ధరలో ప్లాన్స్ తీసుకురావాలని టెలికం కంపెనీలను ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆదేశించింది. టెలికాం కన్స్యూమర్ ప్రొటెక్షన్ (13వ అమెండ్మెంట్) రెగ్యులేషన్స్, 2026ను అనుసరించి మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలో ఇప్పటికీ కోట్ల మంది వినియోగదారులు బేసిక్, ఫీచర్ ఫోన్లు వాడుతున్నారు. వీరిలో చాలా మందికి మొబైల్ ఇంటర్నెట్ వాడటం రాదు. అలాగే, ఎస్సెమ్మెస్లతో కూడా పెద్దగా పని ఉండదు. అయినప్పటికీ.. మొబైల్ రీచార్జ్ చేయాలంటే అన్నింటికీ కలిపి ఎక్కువ మొత్తం చెల్లించి రీచార్జ్ చేసుకోవాల్సిందే. కొన్నిసార్లు ఫీచర్ ఫోన్లు వాడే వారు కూడా మొబైల్స్ డాటాతో రీచార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. దీంతో చాలా మంది యూజర్లు తమకు అవసరం లేని వాటికి కూడా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రాయ్ స్పందించింది. ఈ అంశాన్ని గుర్తించిన ట్రాయ్.. ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ఈ అంశంలో ఈ ఏడాది ఏప్రిల్ 7 నుంచి ప్రజల నుంచి వినతులు, సలహాలు తీసుకుంది. జూన్ వరకు ప్రజల నుంచి వేలాది స్పందనలు వచ్చాయి. వీటన్నింటినీ పరిశీలించిన ట్రాయ్.. తాజాగా చట్టానికి సవరణలు చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. వినియోగదారులకు ఉపయోగపడేలా, తక్కువ ధరలో, వారి అవసరాలకు అనుగుణంగా ప్లాన్స్ ప్రవేశపెట్టాలని టెలికాం కంపెనీలను ఆదేశించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *