– హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో మరోసారి పెచ్చులు ఊడిపడటం కలకలం రేపింది. తాజాగా ఆర్బసీయూ, ఫిజియోథెరపీ విభాగంలో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఎవరూ లేకపోవడంతో తృటి లో పెను పెను ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో ఎంజీఎం దవాఖానకు మీడియా రాకుండా ఆంక్షలు విధించారు. హాస్పి టల్ గేటు ముందు పోలీసులను భారీగా మోహరించారు. హాస్పిటల్ స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో ముగ్గురు రోగులు సహా 8 మందికి గాయాలైన ఘటన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఆదివారం జరిగింది. ఉదయం 9 గంటల సమయంలో ఆరోగ్యశ్రీ వార్డులో స్లాబ్ పెచ్చులు ఊడి సీలింగ్ పెద్ద శబ్దంతో ఒక్కసారిగా కింద కూలిపోయింది. ఈ ప్రాం తంలో పక్షవాతంతో చికిత్స పొందుతున్న మస్తాన్, సారయ్య, ఆయాసంతో చికిత్స పొందుతున్న స్వప్నకు తీవ్ర గాయాల
య్యాయి. అటెండెంట్లు ఓంకార్, ఎల్లమ్మ, భిక్షపతి, వార్డును శుభ్రం చేస్తున్న శానిటేషన్ ఉద్యోగులు పుష్ప, సౌందర్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే దాస్యంను అడ్డుకున్న పోలీసులు
– బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట 
ఎంజీఎం దవాఖాన వద్ద మంగళవారం క్షేతీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హాస్పిటల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు, మౌలిక వసతుల కొరత, రోగుల ఇబ్బందులను పరిశీలించేందుకు వెళ్లిన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ ను పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. కాలు, చేతి నుంచి రక్తస్రావమైందని, పోలీసులు తనపై దాడి చేశారని, కడుపులో తన్నారని వినయభాస్కర్ ఆరోపించారు. అనంతరం ఆయనను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. రోగులను పరామర్శించి దవాఖానలోని పరిస్థితులను తెలుసుకునేందుకు వినయభాస్కర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకున్నారు. అనుమతిపై స్పష్టత రాకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు వోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గేటు పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలు, పో లసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కార్యకర్తలను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయడంతో పెనుగులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. వారిని తోసుకుంటూ ముందుకెళ్లే ప్ర-యత్నం చేయగా తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో ఎంజీఎం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ కనుసన్నల్లోనే పోలీసులు తనపై దాడి చేశారని వినయభాస్కర్ ఆరోపించారు. తనను ఎంజీఎంలో కాకుండా ప్రైవేటు హాస్పిటల్ కు తరలించడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఎంజీఎంలోనే చికిత్స అందించండి.. ప్రైవేటు హాస్పిటల్ కు వద్దు’ అంటూ పోలీసులను కోరారు. కుట్రపూరితంగా తనను అజరా హాస్పిటల్ కు తరలించారని వినయభాస్కర్ ఆరోపించారు.
పేదలకు వైద్యం కరవు
ఎంజీఎంలో పేదలకు కనీస వైద్య సదుపా యా లు అందడం లేదని వినయ్ భాస్కర్ విమర్శిం చారు. రోగులకు సరిపడా బెడ్లు లేకపోవడం, పెచ్చులూడుతున్న భవనాల పైకప్పులు, అంబు లెన్స్ల కొరత వంటి సమస్యలను ప్రభుత్వం ప ట్టించుకోవడం లేదని ఆరోపించారు. మూడేళ్లు గా ఈ సమస్యలపై పాలకులు దృష్టి సారించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయ త్నాలను పోలీ సులతో అడ్డుకోవడం తగదని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.
పోలీసులపై మహిళల ఆగ్రహం
వినయభాస్కర్ ను పోలీసులు అడ్డుకోవడంపై అక్కడ ఉన్న కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీఎంలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన వినయభాస్కర్ను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను నిలదీశారు. కాగా వినయభాస్కర్ పై పోలీసులు దాడి చేయడాన్ని అడ్డుకునేందుకు యత్నించిన బీఆర్ఎస్పీ నాయకుడు బైరపాక ప్రశాంత్ గొంతును ఏసీపీ నర్సింహారావు నొక్కారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





