పండుగల సీజన్ లో ప్రయాణికులకు ఊరట

– విశాఖ – సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్, అక్టోబర్ 21: దసరా పండుగ సీజన్లో ప్రయాణించే ప్రయాణి కులకు ఇబ్బందిలేని ప్రయాణాన్ని అందించడానికి, అదనపు రద్దీని నివారించడానికి భారత రైల్వే ప్రకారం డిమాండ్ పై ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలు సర్వీసులు నడపనున్నారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం – సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 08517 గురువారం, ఆదివారం తేదీలు 22, 25న విశాఖపట్నం నుంచి 15:50 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు దువ్వాడకు 16:18 గంటలకు చేరుకుని 16:20 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అదే రైలు శుక్రవారం, సోమవారం (2 సర్వీసులు) సేవలు అందించనున్నాయి. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 08518 సికింద్రాబాద్ – విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ ప్రెస్ శుక్రవారం 23, సోమవారం 26న సికింద్రాబాద్ నుండి రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు ఉదయం 11:18 గంటలకు దువ్వాడ చేరుకుని 11:20 గంటలకు బయలుదేరి, 12:05 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. శనివారం, మంగళవారం (2 సర్వీసులు) ఉంటాయి.

హాల్టింగ్స్

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య ఇరువైపులా మార్గాల్లో దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, భీమవరం టౌన్, గుడివాడ జంక్షన్, విజయవాడ, కృష్ణాకెనాల్, గుంటూరు, మిర్యాల గూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్లలో రైలు ఆగుతుందని అధికారులు తెలిపారు.

కోచ్ వివరాలు

ఈ రెండు రైళ్లలో మొత్తం 19 కోచ్ లు ఉంటాయి. ఇందులో 2వ ఎసి – 2, 3వ ఎసి – 4, స్లీపర్ 7, జనరల్ సెకండ్ క్లాస్-4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్, దివ్యాంగుల కోచ్ – 1, జనరేటర్/బ్రేక్ వ్యాన్ – 1 కోచ్ ఉంటాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *