వైభవంగా దుర్గామాత నిమజ్జనాలు

– ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: నగరంలో దుర్గామాత శరన్నవరాత్రి వేడుకల ముగింపు సందర్భంగా అమ్మవారి విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహ‌లంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన మార్గాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పలు మార్గాల్లో ట్రాఫిక్ ను దారి మళ్లిస్తున్నారు.

ముఖ్యమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు 

పీపుల్స్ ప్లాజా, గార్డెన్ పాయింట్, జలవిహార్, సంజీవయ్య పార్క్ జేబీ పాండ్స్ వద్ద నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ రూట్: పంజాగుట్ట, రాజ్భవన్ వైపు నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్కు వచ్చే వాహనాలను ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. వి.వి విగ్రహం వద్ద ట్రాఫిక్ ను నిరంకారి జంక్షన్ వైపు పంపిస్తున్నారు. ఇక్బాల్ మినార్ వైపు సాధారణ వాహనాలకు ప్రవేశం లేదు. కేవలం నిమజ్జనానికి వచ్చే వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. పాత పోలీస్ స్టేషన్ సైఫాబాద్ వద్ద వాహనాలను రవీంద్ర భారతి, మాసాబ్యాంక్ వైపు మళ్లిస్తు న్నారు. ఖైరతాబాద్ బడా గణేశ్ లేన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాలు నిలిపివేశారు. అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి వచ్చే వాహనాలను లిబర్టీ వైపు మళ్లిస్తుండగా లిబర్టీ నుంచి సెక్రటేరియట్ జంక్షన్ వైపు సాధారణ వాహనాలకు అనుమతి లేదు. నల్లగుట్ట బ్రిడ్జ్, పీవీ మార్గ్ నుంచి వచ్చే ట్రాఫిక్ను మినిస్టర్ రోడ్డు వైపు మళ్లిస్తున్నారు. రాణిగంజ్, మినిస్టర్ రోడ్డు నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వెళ్లే వారికి ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు.

ప్రయాణికులకు పోలీసుల విజ్ఞప్తి

నిమజ్జన ప్రాంతాల పరిసరాల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం. ఉన్నందున, నగర ప్రజలు, వాహదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. అవసరమైన వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవా లని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించి నిబంధనలు పాటించాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *