ఎస్‌బీఐ ఖాతాలపై సైబర్‌ దాడి

– డార్క్‌వెబ్‌లోకి 3,897 మంది కస్టమర్ల వివరాలు
– ధ్రువీకరించిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
– దర్యాప్తునకు థర్డ్ పార్టీ సైబర్ ఏజెన్సీ నియామకం

హైదరాబాద్,  అక్టోబర్ 21 :దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సైబర్ దాడికి గురైంది. హ్యాకర్ల దాడి కారణంగా 3,897 మంది వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత డేటా బహిర్గతమై డార్క్‌ వెబ్‌లోకి వెళ్లినట్లు ఎస్‌బీఐ అధికారికంగా ధ్రువీకరించింది. ఈ డేటా లీక్‌లో కస్టమర్ల పేర్లు, లింగం, మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీ, నివాస చిరునామాలు, ఈమెయిల్ ఐడీలతో పాటు లోన్ అప్లికేషన్‌లకు సంబంధించిన కీలక సమాచారం ఉన్నట్లు తెలిసింది. డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ (డీసీఏ), ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వంటి థ్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అందిన అలర్ట్ ఆధారంగా ఈ వ్యవహారం బయటపడింది. ప్రాథమికంగా డార్క్‌వెబ్‌లో లభ్యమైన సుమారు 3.75 లక్షల రికార్డుల డేటాసెట్‌ను విశ్లేషించగా, అందులో 3,897 ఎస్‌బీఐ కస్టమర్ రికార్డులు లీక్ అయినట్లు గుర్తించారు. తక్షణమే అప్రమత్తమైన ఎస్‌బీఐ యాక్షన్ ప్రోటోకాల్‌ను యాక్టివేట్ చేయడంతో పాటు, ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు సిఇఆర్టి-ఇన్  ప్యానెల్‌లోని స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీని రంగంలోకి దించింది.

కోర్ బ్యాంకింగ్ సేవలు భద్రం – సాధారణంగానే లావాదేవీలు

ఈ సైబర్ దాడి వల్ల బ్యాంకు కోర్ ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ సేవలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని ఎస్‌బీఐ తేల్చిచెప్పింది. కస్టమర్ల రికార్డులు కొన్ని లీక్ అయినప్పటికీ, బ్యాంకు నిత్యవారీ వ్యాపార కార్యకలాపాలు ఎప్పటిలాగే సాగుతున్నాయని వెల్లడించింది. లీక్ అయిన సమాచారం యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి మరియు వినియోగదారులకు కలిగే నష్ట తీవ్రతను అంచనా వేయడానికి సమగ్ర విచారణ కొనసాగుతోందని, దర్యాప్తు ముగిశాక తగిన సరిదిద్దే చర్యలు తీసుకుంటామని బ్యాంకు యాజమాన్యం స్పష్టం చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *