– జన్మతః పిల్లల పౌరసత్వం కేసులో..
న్యూయార్క్, జూలై 2: విదేశీ వలసదారుల పిల్లల పౌరసత్వాన్ని పరిరక్షిస్తూ అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై భారతీయ అమెరికన్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీయుల పిల్లలకు పౌరసత్వం నిరాకరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారులు, తాత్కాలిక వీసాలు కలిగిన వారి పిల్లలు అమెరికాలో జన్మిస్తే వారిని అమెరికన్లుగానే పరిగణించాలని కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ఇండో అమెరికన్లు హర్షం చేస్తున్నారు. ఈ తీర్పు అమెరికాలోని వలస కుటుంబాలకు గొప్ప భరోసా కల్పించిందంటున్నారు. ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో ప్రత్యక్షంగా ప్రభావితం అయ్యేది భారత్, దక్షిణాసియా వలస కుటుంబాలేనన్నారు. అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పు చరిత్రాత్మక విజయం అని పలువురు ఎన్నారైలు అభివర్ణించారు. దాదాపు 52 లక్షల మంది ఇండో అమెరికన్లలో 12 లక్షల మందికి పైగా ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని ఎఫఐఐడీఎస్ అధ్యక్షుడు ఖండేరావ్ కంద్ తెలిపారు. అమెరికాలో ప్రస్తుతం 6 నుంచి 7 లక్షల మంది హెచ్-1బీ వీసాదారులు ఉన్నట్లు తాజా అంచనాలు పేర్కొంటున్నాయి. వారిలో 70 శాతానికి పైగా భారతీయులే ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో హెచ్`1బీ వీసాదారులకు ఊరట లభించనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




